Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వంకాయలు చింతపండు పసుపు కారంపొడి ఉల్లిపాయ ధనియాల పొడి బెల్లం కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు వంకాయ పులుసు కావలసిన వస్తువులు 250గ్రా.లు పెద్ద నిమ్మకాయంత 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ - 1 1 టీస్పూన్ చిన్నముక్క 2 రెబ్బలు 3 తగినంత 1/2 టీస్పూన్ అల్లంవెల్లుల్లిముద్ద నూనె ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర 3 స్పూన్లు 1 టీస్పూన్ కొద్దిగా తయారుచేసే విధానం వంకాయలు ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. చింతపండులో కొన్ని నీళ్లు పోసి నానబెట్టి చిక్కగా పులుసు తీసి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కాస్త వేగాక సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో వంకాయ ముక్కలు, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి వేయించాలి. ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కప్పుడు నీళ్ళు, ధనియాల పొడి వేసి మరిగించాలి. తర్వాత చింతపండు పులుసు, కారంపొడి, తగినంత ఉప్పు, కరివేపాకు, బెల్లం వేసి పచ్చివాసన పోయేవరకు మరిగించి కొత్తిమీర వేసి దించేయాలి. తెలంగాణ రుచులు 118