వంకాయ పచ్చి మసాలా కూర కావలసిన వస్తువులు తెల్ల వంకాయలు ఉల్లిపాయలు 250గ్రా.లు 2 మెంతులు 1/4 టీస్పూన్ పెరుగు 1/2 టీస్పూన్ పచ్చిమిర్చి 10 5 అల్లంవెల్లుల్లిముద్ద 1/2 టీస్పూన్ పసుపు 1/4 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ ఉప్పు నూనె తగినంత 4 టీస్పూన్లు కొబ్బరిపొడి 3 టీస్పూన్లు పల్లీలు 3 టేబుల్స్పూన్లు జీలకర్ర, మెంతులు కొత్తిమీర - 1/4 టీస్పూన్ కొద్దిగా నువ్వులు 2 టీస్పూన్లు తయారుచేసే విధానం ఈ కూర తెల్ల వంకాయలతో చేస్తే బావుంటుంది. ముందుగా గిన్నె లేదా కడాయి వేడి చేసి జీలకర్ర, నువ్వులు, మెంతులు, పల్లీలు దోరగా వేయించి పెట్టుకోవాలి. అందులో రెండు చెంచాల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని వేయించిన ఉల్లిపాయలు, కొబ్బరిపొడి, పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కడాయిలో మిగిలిన నూనె వేసి వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి మెత్తబడ్డాక గుత్తులుగా లేదా పెద్ద ముక్కలుగా తరిగిన వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త మెత్తబడ్డాక రుబ్బిన మసాలా, కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. కూర ఉడికి నూనె తేలిన తర్వాత కొత్తిమీర వేసి దింపేయాలి. వంకాయ సెనగపప్పు కూర కావలసిన వస్తువులు వంకాయలు సెనగపప్పు 250గ్రా.లు 50గ్రా.లు ఉల్లిపాయ 1 కరివేపాకు అల్లంవెల్లుల్లి ముద్ద - 2 రెబ్బలు 1/2టీస్పూన్ తయారుచేసే విధానం పసుపు 1/4 టీస్పూన్ కారంపొడి 1 టీస్పూన్ గరంమసాలా పొడి 1/4 టీస్పూన్ - ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్లు సెనగపప్పు కడిగి నీళ్ళుపోసి అరగంట నానబెట్టాలి. వంకాయలు ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లిముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేపి నానిన సెనగపప్పు వేయాలి. పప్పు తడి పోయేవరకు నిదానంగా వేపి ఇందులో వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. అవసరమైతే అరకప్పు నీళ్ళు వేసుకోవచ్చు. వంకాయ ముక్కలు, సెనగపప్పు, పూర్తిగా ఉడికిన నీరంతా ఇగిరి పోయాక గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 117 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/138
స్వరూపం