వంకాయలు 250గ్రా.లు 1/4 టీస్పూన్ వంకాయ వేపుడు కావలసిన వస్తువులు పసుపు కారంపొడి 1 టీస్పూన్ ధనియాలపొడి కొబ్బరిపొడి 1 టీస్పూన్ 3 టీస్పూన్లు కరివేపాకు ఉప్పు 2 రెబ్బలు తగినంత నూనె 3-4 టీస్పూన్లు ఆవాలు, జీలకర్ర 1/2 టీస్పూన్ తయారుచేసే విధానం వంకాయలు కడిగి సన్నగా పొడవుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేయాలి. కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. వంకాయ ముక్కలు తీసి జల్లెట్లో వేసి నీరంతా పోయాక పోపులో వేయాలి. ఇందులో పసుపుపొడి, కలిపి నిదానంగా వేయించాలి. మూత పెడితే ముక్కలు ముద్దగా మారతాయి. ముక్కలు సగం ఉడికి వేగిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. వంకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొబ్బరిపొడి వేసి మరో రెండు నిముషాలు వేపి దింపేయాలి. వంకాయ టమాట కూర కావలసిన వస్తువులు వంకాయలు టమాటాలు ఉల్లిపాయ కరివేపాకు పసుపు కారంపొడి తయారుచేసే విధానం 250గ్రా.లు ధనియాలపొడి టీస్పూన్ 2 చింతపండు పులుసు 1/2 కప్పు - 1 ఉప్పు తగినంత 2 రెబ్బలు అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ - 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ నూనె 3 టీస్పూన్లు - వంకాయలు చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి. చిన్న గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి ఇందులో పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు, కారంపొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ధనియాల పొడి వేసి ఉడికించాలి. ముక్కలన్నీ ఉడికిన తర్వాత చింతపండు పులుసు, అరకప్పు నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికించాలి. కూర ఉడికి దగ్గర పడ్డాక దింపేయాలి. తెలంగాణ 115 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/136
స్వరూపం