Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆవకాయలు మామిడికాయ, అల్లం ఆవకాయ కావలసిన వస్తువులు మామిడికాయ ముక్కలు ఉప్పు పచ్చడి కారంపొడి అల్లంముద్ద వెల్లుల్లిముద్ద తయారుచేసే విధానం - - జీలకర్ర పొడి 100గ్రా.లు - 250గ్రా.లు మెంతిపొడి 1 టీస్పూన్ 125గ్రా.లు పసుపు 1 టీస్పూన్ - 125 గ్రా.లు ఇంగువ 1/4 టీస్పూన్ 125గ్రా.లు నువ్వుల నూనె 250గ్రా.లు - మామిడికాయలు మంచి కండ, పీచు ఉన్నవి తీసుకుని కడిగి, బట్టతో తుడిచి ముక్కలు కొట్టించాలి. ముక్కలు కొట్టిన తర్వాత జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో కారంపొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. గిన్నెలో నువ్వులనూనె బాగా వేడి చేయాలి. ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడగానే దింపేయాలి. నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది. నూనె చల్లారిన తర్వాత ముక్కలు మసాలాలో వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలో పెట్టుకోవాలి. ఐదవరోజు నుండి తినొచ్చు. మామిడి ఆవకాయ మామిడికాయ ముక్కలు 1 కేజి ఉప్పు 250గ్రా.లు నువ్వుల నూనె 250గ్రా.లు కావలసిన వస్తువులు ఆవపొడి పచ్చడి కారంపొడి పసుపు అల్లం ముద్ద 50 గ్రా.లు ఇంగువ వెల్లుల్లి ముద్ద 50గ్రా.లు వెల్లుల్లి జీలకర్ర పొడి 100గ్రా.లు జీలకర్ర, మెంతులు మెంతిపొడి 1 టీస్పూన్ 100గ్రా.లు - 125గ్రా.లు 1 టీస్పూన్ - 1/2 టీస్పూన్ - రెబ్బలు 1 టీస్పూన్ తయారుచేసే విధానం మామిడికాయ ముక్కలు తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కారంపొడి, ఉప్పు, ఆవపొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నువ్వులనూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత జీలకర్ర, మెంతులు వేయాలి. అవి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లంముద్ద, వెల్లుల్లిముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా వేసి కలపాలి. ఇందులో మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపి జాడీలోకి ఎత్తిపెట్టాలి. మూడవరోజున తీసి ఇంకోసారి కలిపి పెట్టుకోవాలి. తెలంగాణ 107 రుచులు