దొండకాయలు పసుపు 1 టీస్పూన్ కారంపొడి 100 గ్రా.లు ఆవపొడి దొండకాయ పచ్చడి కావలసిన వస్తువులు అల్లం వెల్లులి ఇంగువ 100 గ్రా.లు 1/4 టీస్పూన్ 50గ్రా.లు జీలకర్రపొడి 2 టీస్పూన్లు ఉప్పు 250గ్రా.లు మెంతిపొడి నూనె 1/2 టీస్పూన్ జీలకర్ర, మెంతులు 1 టీస్పూన్ 200 గ్రా.లు తయారుచేసే విధానం దొండకాయలను కడిగి, తడి లేకుండా తుడిచి నిలువుగా నాలుగు ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో కారంపొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, ఆవపొడి, ఉప్పు, పసుపు వేసి ఉండలు లేకుండా కలిసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పొడులు, దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకి ఎత్తుకోవాలి. మరునాటి నుండి తినడానికి వేసుకోవచ్చు. టమాటాలు 250గ్రా.లు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు 5 1 టీస్పూన్ 2 టీస్పూన్లు వెల్లుల్లి 5 రెబ్బలు టమాటా పచ్చడి - 1 కావలసిన వస్తువులు పసుపు 1/4 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్లు కరివేపాకు 2 రెబ్బలు తయారుచేసే విధానం కడాయి వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోని చెంచాడు నూనె వేడి చేసి సన్నగా తరిగిన టమాటాలు, వెల్లుల్లి, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత ముందు వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని టమాటా, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి కాస్త వేగాక కరివేపాకు వేసి దింపి పచ్చడిలో కలపాలి. తెలంగాణ 105 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/126
స్వరూపం