Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పచ్చి చింతకాయలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కొబ్బరి చింతకాయ పచ్చడి - 3 కావలసిన వస్తువులు - 200 గ్రా.లు 100గ్రా. లు 4-5 కొద్ది తగినంత ఆవాలు, జీలకర్ర ఎండుమిర్చి 1/4 టీస్పూన్ 2 నూనె 3 టీస్పూన్లు కరివేపాకు 2 రెబ్బలు తయారుచేసే విధానం పచ్చి చింతకాయ చెక్కు తీసి వలచి గింజలు తీసేయాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసి పచ్చడిలో కలపాలి. ఉల్లిపాయ పచ్చడి కావలసిన వస్తువులు ఉల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర 250గ్రా.లు 5 నువ్వులు చింతపండు పులుసు 1 టేబుల్ స్పూన్ 1/4 కప్పు 1 టీస్పూన్ పసుపు 1/4 టీస్పూన్ ధనియాలు 2 టీస్పూన్లు ఉప్పు ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ నూనె తగినంత 4 టీస్పూన్లు పల్లీలు 3 టీస్పూన్లు కరివేపాకు 2 రెబ్బలు తయారుచేసే విధానం కడాయి వేడి చేసి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పల్లీలు దోరగా వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో రెండు చెంచాల నూనె వేడి చేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించి పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని ఉల్లిపాయ, చింతపండు పులుసు, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి రుబ్బిన పచ్చడిలో కలపాలి. తెలంగాణ రుచులు 104