Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మామిడి కొబ్బరి తురుము పచ్చడి - 3 కావలసిన వస్తువులు పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు మామిడి తురుము 1 కప్పు పచ్చిమిర్చి 3 ఎండుమిర్చి 3 1/4 టీస్పూన్ మినప్పప్పు 1 టీస్పూన్ సెనగపప్పు 2 టీస్పూన్లు కరివేపాకు ఉప్పు 2 రెబ్బలు తగినంత ఆవాలు, జీలకర్ర తయారుచేసే విధానం నూనె - 3 టీస్పూన్లు మామిడికాయ చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. పచ్చి కొబ్బరి కూడా తురుముకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిర్చి, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, మినప్పప్పు, సెనగపప్పు వేసి దోరగా వేపాలి. ఇందులో కరివేపాకు వేసి కొబ్బరి తురుము, మామిడి తురుము, పసుపు వేసి కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి. పచ్చి కొబ్బరి తురుము ఎండుమిర్చి - 1 కప్పు 3-4 1 టీస్పూన్ కొబ్బరి పచ్చడి - 4 కావలసిన వస్తువులు ఉప్పు ఆవాలు, జీలకర్ర కరివేపాకు ధనియాలు మెంతులు - 2 టీస్పూన్ నూనె - చిటికెడు తగినంత - 1/4 టీస్పూన్ 2 రెబ్బలు 3 టీస్పూన్లు తయారుచేసే విధానం కడాయిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర ధనియాలు, మెంతులు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పొడి చేసుకుని పచ్చికొబ్బరి, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడుతుండగా కరివేపాకు వేసి రుబ్బుగిన్నె పచ్చడిలో కలపాలి. తెలంగాణ రుచులు 102