వంకాయ పచ్చడి కావలసిన వస్తువులు లేత వంకాయలు 250 LT.CO కరివేపాకు 2 రెబ్బలు టమాటా 1 చింతపండు పులుసు 3 టీస్పూన్లు పచ్చిమిర్చి 5 కొత్తిమీర కొద్దిగా ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ పసుపు చిటికెడు మినప్పప్పు సెనగపప్పు 1 టీస్పూన్ ఉప్పు తగినంత 2 టీస్పూన్లు నూనె 4 టీస్పూన్లు తయారుచేసే విధానం కడాయిలో చెంచాడు నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడి చేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి మూతపెట్టి కాస్త మెత్తబడ్డాక చింతపండు పులుసు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న దినుసులు బరకగా పొడి చేయాలి. తర్వాత వంకాయ మిశ్రమాన్ని, తగినంత ఉప్పు వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. కొబ్బరి వంకాయ పచ్చడి కావలసిన వస్తువులు పెద్ద సైజు వంకాయలు చింతపండు జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు తయారుచేసే విధానం 250గ్రా.లు కొత్తిమీర కొద్దిగా నిమ్మకాయంత 1 టీస్పూన్ మెంతులు చిటికెడ ఉప్పు తగినంత - 4 నూనె 3 టీస్పూన్లు 1 టీస్పూన్ పెద్ద సైజు లేత వంకాయలు తీసుకుని కడిగి తుడిచి పైనంతా నూనె రాసి నిప్పుల మీద కాల్చాలి. వంకాయ బాగా మగ్గినట్టు అనిపించాక పక్కన పెట్టి చల్లారిన తర్వాత కాలిన పొట్టు తీసేసి గుజ్జు అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో మిగిలిన నూనె వేడి చేసి జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఇందులో వంకాయ గుజ్జు, కొత్తిమీర, చింతపండు తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇష్టముంటే పైనుండి పోపు పెట్టుకోవచ్చు. తెలంగాణ 99 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/120
స్వరూపం