జనాభాలో కోట్లాది మంది మరణిస్తారు అని అంచనా వేసారు. కానీ చిత్రంగా, అభివృద్ధి చెందిన దేశాలలో కన్నా భారతదేశంలో కరోనా మరణాల నిష్పత్తి తక్కువగా ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ తర్వాత ధృవీకరించింది. శుభ్రత (Cleanliness and sanitation), సామాజికదూరం (Social Distance) పాటించే విషయంలో అంతగా పరిణతి చెందని మనదేశం అనతి కాలంలోనే నిర్జనమైపోతుందని అందరూ అంచనా వేసారు. ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంచనాలను తలక్రిందులు చేస్తూ భారతదేశంలో కరోనా వైరస్ ఆందోళన పడినంతగా ప్రభావం చూపించలేకపోయింది. దీనికి కారణాలు ఏమిటి? అని అధ్యయనాలు చేస్తే, ఆ రహస్యం మన ఒంట్లోని రోగనిరోధక శక్తి (Immunity) లో ఉందని, దానికి కారణం మన వంటింట్లో, పోపుల పెట్టెలో ఉందని వెల్లడయ్యింది. అంటే మన ఆహారపుటలవాట్లలో, ఆహార తయారీ విధానంలో మనం వాడే మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు మనకు తెలియకుండానే మనలో రోగనిరోధకశక్తిని పెంచాయని, దానివల్ల, కరోనా బారి నుంచి భారతీయులు తప్పించుకున్నారని వెల్లడయ్యింది. అలా మనం తీసుకునే ఆహారం మనకు ఔషధంగా కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. - దీనినే ఇటీవలి కాలంలో "ఆహార చికిత్స" (Food Therapy) అంటున్నారు. అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన టి.వి. రియాలిటీ షో "The Biggest Loser: Couples 4" హోస్ట్ ప్రఖ్యాత Celebrity Fitness Trainer గా అయిన Brett Hoebel" "ఆహార చికిత్స”ను సమర్థిస్తున్నాడు. ఆయన “Food is lot of people's therapy - when we say comfort food, we really mean that. Itis releasing dopamine and serotonin in your brain that makes you feel good" అని స్పష్టం చేశారు. ఇక Nutrition Psychologists అయితే మనిషిలోని మానసిక (Mental fluctuations) చిత్త చాంచల్యాలకు, Stress, Depression, Crises, Anxiety, Loss of Memory వంటి మనోరుగ్మతల నిదానానికి, చికిత్సకు ఆహారమే ప్రాథమిక ఔషధంగా (Food as a primary medicine) పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటే ఆహారం కేవలం శారీరకపరమైన ఉత్తేజానికి, ఉత్సాహానికి మాత్రమే కాక, మానసికపరమైన ఉల్లాసానికి, ఉద్వేగ సంతులనకు (Balance in emotions) కూడా దోహదపడ్తుందని తేటతెల్లమవుతుంది. మరొకవైపున ప్రస్తుతం భోజనం, వంటలు అనేది పరిశ్రమ (Food Industry) స్థాయికి ఎదిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిలో పర్యాటక స్పృహ (Awareness of Tourism) పెరగడం, దేశాటనం, సంచారం అనే ప్రాచీన భారతీయ జీవన విలువలకు కొనసాగింపుగా 'పర్యాటకం' నేడు ఆధునిక రూపంలో విస్తరించడంవల్ల 'ఆహారం - రుచులు' కూడా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో వచ్చిన 'సామాజిక మాధ్యమాల విప్లవం' (Social Media Revolution) కూడా దీనిని మరింత ముందుకు తీస్కెళ్ళింది. వంటలు, భోజనాలు, వంటల తయారీ విధానం వంటి అంశాలను నేర్పించడానికి గతంలో అమ్మలు, కుటుంబం ఆధారంగా ఉండేది. 1995లో టి.వి. ఛానెల్ల విస్తరణ అనంతరం న్యూస్ ఛానెల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్లో వంటల తయారీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపున వంటలను నేర్పించడానికి నగరాలలో ప్రత్యేక విధాన సంస్థలు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, దేశ విదేశీ వంటల తయారీలో శిక్షణ కోసం ప్రత్యేకంగా “ఛెఫ్” కోర్సులు అకాడెమిక్"గా రూపొందాయి. వీటికి సమాంతరంగా కాలనీలు, అపార్ట్మెంట్లలో బామ్మలు, మామ్మలు, స్వగృహ ఫుడ్స్ వంటి చిన్న స్థాయి కుటీర వ్యవస్థలు వంటల చిట్కాలను నేర్పించడం మొదలెట్టాయి. ఇలా సువ్యవస్థీకృతంగానూ, అవ్యవస్థీకృతంగానూ నిర్వహించే "సంప్రదాయ శిక్షణా తరగతులు” మాత్రమే కాక, ఆన్లైన్ లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా వర్చువల్ తరగతులు నడుస్తున్నాయి. అంతేగాక, భారతీయ వంటలు, తెలుగు వారి వంటలు, తెలంగాణా వంటకాల గురించిన యూట్యూబ్ ఛానెల్లు ఇప్పుడు అత్యంత ప్రేక్షకాదరణతో సాగుతున్నాయి. ఈతరం యువతకు వంటలు రాకపోవడం, ఉద్యోగవృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళాల్సి రావడం వంటి కారణాలవల్ల 'గూగుల్నే గురువుగా భావించి 'ఏకలవ్య శిష్యులు'గా వంటలపై ప్రయోగాలు చేస్తున్న 'Generation-Z' ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాలకు రాజపోషకులుగా ఉన్నారు. ఈ డిజిటల్ పరిణామాలన్నీ సమకాలీనంగా నవయువతరంలో సంప్రదాయ వంటలు, రుచులు, ఆహారంపట్ల పెరుగుతున్న ఆసక్తికి ఉదాహరణగా చెప్పదగినవే! వీటన్నిటి దృష్ట్యా తెలంగాణాకే ప్రత్యేకమైన ఆహారపుటలవాట్లు, వంటకాలు అన్నిటినీ ఒక్కచోట కూర్చి ఆహార రుచుల రంగంలో కూడా తెలంగాణాకున్న ప్రత్యేకతను తెలియ చెప్పాలనుకున్నాము. అలాగే, అనివార్యంగా సంభవించిన ఇతర రాష్ట్రాల ప్రభావం వల్ల మనదైన వంటలు, వంటకాలు కూడా మన స్మృతి పేటికలోంచి కనుమరుగైన సందర్భం ఏర్పడింది. ఇప్పుడు అంతటా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోశె, చపాతీ లాంటివే కనిపిస్తాయి. నిశితంగా గమనిస్తే ఇవన్నీ మద్రాసీ లేదా కన్నడ ప్రాంత ఉడిపి హోటల్ల తాలూకు ప్రభావం అని అర్థమవుతుంది. ఈ సందర్భంలో అసలు తెలంగాణా బ్రేక్ఫాస్ట్లు ఏంటి? అసలు మనకంటూ ఈ వంటకాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తున్న సందర్భంలోనే 2017లో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణా ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దానికి భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా సాహిత్య అకాడెమీ బాధ్యత తీసుకున్నాయి. ఆ క్రమంలో దేశ విదేశాలనుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రతినిధులకు తెలంగాణా రుచులను, వంటకాలను అందించాలని భావించి ఆ vii
పుట:తెలంగాణ రుచులు.pdf/12
స్వరూపం