పాలకూర పచ్చడి - 1 కావలసిన వస్తువులు పాలకూర తరుగు ఎండుమిర్చి 2 కప్పులు ఉప్పు తగినంత 4-5 నూనె 3 టీస్పూన్లు 1 టీస్పూన్ ధనియాలు నువ్వులు 2 టీస్పూన్లు 2 టీస్పూన్లు ఆవాలు, జీలకర్ర కరివేపాకు 1/4 టీస్పూన్ 1 రెబ్బ తయారుచేసే విధానం పాలకూర ఆకులు కడిగి ఆరబెట్టాలి. కడాయిలో చెంచాడు నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఇంకో చెంచాడు నూనె వేడి చేసి పాలకూర తరుగు వేసి మగ్గనివ్వాలి. ఆకుకూర పూర్తిగా మెత్తబడ్డాక దింపేయాలి. ముందు వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని పాలకూర, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి దింపి పచ్చడిలో వేసి కలపాలి. పాలకూర పచ్చడి - 2 కావలసిన వస్తువులు పాలకూర తరుగు పచ్చిమిర్చి 3 కప్పులు 1 టీస్పూన్ 5 ఉప్పు తగినంత పసుపు 1/4 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ 6 నూనె 3 టీస్పూన్లు వెల్లుల్లి తయారుచేసే విధానం కడాయిలో చెంచాడు నూనె వేడి చేసి జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కాస్త వేగాక కడిగి, తరిగిన పాలకూర, పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చడిలో వేసి కలపాలి. తెలంగాణ 95 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/116
స్వరూపం