T పులిసింతాకు ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి తయారుచేసే విధానం 2 కప్పులు 20 5 1 టీస్పూన్ - 1 టీస్పూన్ - 4 రెబ్బలు పులిసింతకూర పచ్చడి కావలసిన వస్తువులు 2 రెబ్బలు తగినంత ఉప్పు ఆవాలు/జీలకర్ర 1/2 టీస్పూన్ నూనె 3 టీస్పూన్లు పులిసింతాకు శుభ్రం చేసుకుని కడిగి ఆరబెట్టుకోవాలి. కడాయిలో చెంచాడు నూనె వేడి చేసుకుని ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరికొంచెం నూనె వేసి కాగిన తర్వాత పులిసింతాకు వేసి మగ్గనివ్వాలి. ముందు వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని మగ్గిన పులిసింతాకు, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త ఎర్రబడ్డాక పచ్చడిలో వేసి కలపాలి. వెల్లుల్లి పులిసింతాకుతోనే మగ్గించి రుబ్బుకోవచ్చు. చెన్నంగి ఆకు ఎండు ఇర్చి జీలకర్ర 250గ్రా.లు 5-6 1/2 టీస్పూన్ చెన్నంగి ఆకు పచ్చడి కావలసిన వస్తువులు ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్లు నిమ్మరసం 1 టీస్పూన్ తయారుచేసే విధానం కడాయిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు వేయించి పక్కన పెట్టుకుని చెన్నంగాకు, వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మగ్గనివ్వాలి. పూర్తిగా మగ్గి మెత్తబడిన తర్వాత దింపేయాలి. చల్లారిన తర్వాత ముందు వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని చెన్నంగాకు మిశ్రమాన్ని తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని నిమ్మరసం కలుపుకోవాలి. తెలంగాణ రుచులు 94
పుట:తెలంగాణ రుచులు.pdf/115
స్వరూపం