Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 పుంటిగూర/గోంగూర పచ్చడి - 3 కావలసిన వస్తువులు పుంటికూర ఆకులు 4 కప్పులు వెల్లుల్లి 8 రెబ్బలు ఎండుమిర్చి 6 పసుపు 1/4 టీస్పూన్ జీలకర్ర 1/4 టీస్పూన్ ఉప్పు తగినంత 3 టీస్పూన్లు నూనె 5 టీస్పూన్లు ధనియాలు తయారుచేసే విధానం చెంచాడు నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి. ఇంకో చెంచాడు నూనె వేసి పుంటికూర ఆకులు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముందు వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని మగ్గిన పుంటికూర ఆకులలో వేసి, తగినంత ఉప్పు కూడా వేసి కలపాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నలక్కొట్టిన వెల్లుల్లి వేసి మెత్తబడేవరకు వేపి పుంటికూర వేసి కలపాలి. వెల్లుల్లి ఎండుమిర్చి, ధనియాలతో కలిపి రుబ్బి పుంటిగూరలో కలుపుకోవచ్చు. ఉల్లిపాయ ఇష్టం లేకుంటే ఆవాలు, జీలకర్రతో పోపు వేసి కలుపుకోవచ్చు. చుక్కకూర పచ్చడి - 1 కావలసిన వస్తువులు చుక్కకూర పచ్చిమిర్చి 3 కప్పులు నూనె 3 టీస్పూన్లు ఆవాలు/జీలకర్ర 1/4 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ మినప్పప్పు 1 టీస్పూన్ పల్లీలు 3 టీస్పూన్లు శనగపప్పు 1 టీస్పూన్ కరివేపాకు వెల్లుల్లి ఉప్పు 4 రెబ్బలు తగినంత 1 రెబ్బ ఎండుమిర్చి 2 తయారుచేసే విధానం చుక్కకూర కాడలు లేకుండా ఆకులు తరిగి శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. కడాయిలో చెంచాడు నూనె వేడి చేసి జీలకర్ర, పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులో ఇంకో చెంచా నూనె వేసి చుక్కకూర ఆకులు, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కలిపి మగ్గనివ్వాలి. వేయించిన జీలకర్ర, పల్లీలు పొడి చేసుకుని చుక్కకూర తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు, సెనగపప్పు, కరివేపాకు వేసి కాస్త ఎర్రబడ్డాక రుబ్బిన పచ్చడిలో కలపాలి. తెలంగాణ 90 రుచులు