Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4. శాకాహార పచ్చళ్ళు పుంటిగూర/గోంగూర పచ్చడి కావలసిన వస్తువులు వెల్లుల్లి ఆవాలు పుంగూర ఆకులు 4 కప్పులు T 1 టీస్పూన్ ధనియాలు 2 టీస్పూన్లు ఉప్పు ఎండుమిర్చి కరివేపాకు 6-8 నూనె 1 రెబ్బ 8 రెబ్బలు 1/2 టీస్పూన్ తగినంత 4 టీస్పూన్లు తయారుచేసే విధానం పుంటిగూర ఆకులు కాడలు లేకుండా తరిగి, కడిగి ఆరబెట్టాలి. కడాయిలో చెంచాడు నూనె వేడి చేసి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత పొట్టు తీసి నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేపాలి. ఇవన్నీ ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇంకో చెంచాడు నూనె వేడి చేసి పుంటిగూర ఆకులు వేసి పూర్తిగా మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న దినుసులు పొడి చేసుకోవాలి. అందులో మగ్గిన పుంటిగూర ఆకులు, తగినంత ఉప్పు వేసి రుబ్బు కోవాలి. చిన్న గరిట లేదా గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి రుబ్బిపెట్టుకున్న పచ్చడిలో వేసి కలపాలి. పుంటిగూర/గోంగూర పచ్చడి - 2 కావలసిన వస్తువులు పుంటికూర ఆకులు 3 కప్పులు - పచ్చిమిరపకాయలు 5 ఉల్లిపాయ 1 1 టీస్పూన్ వెల్లుల్లి ధనియాలు 6 రెబ్బలు 2 టీస్పూన్లు ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్లు తయారుచేసే విధానం కడాయి వేడి చేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు దోరగా వేయించి పెట్టుకోవాలి. అందులోనే చెంచాడు నూనె వేడి చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న పుంటికూర ఆకులను వేసి మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత ముందు వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని వుంటిగూర, తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నలక్కొట్టిన వెల్లుల్లి వేసి దోరగా వేయించి రుబ్బుకున్న పచ్చడిలో వేసి కలపాలి. తెలంగాణ 89 రుచులు