Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కారం పప్పు కావలసిన వస్తువులు కందిపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి 200 గ్రా.లు 1 3 ఉప్పు తగినంత ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ కరివేపాకు 2 రెబ్బలు - 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ నూనె 3 టీస్పూన్లు పసుపు కారంపొడి తయారుచేసే విధానం కందిపప్పు కడిగి నీళ్లు పోసి పసుపు, చెంచాడు నూనె వేసి మెత్తగా ఉడికించాలి. కడాయి లేక గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిలటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడ్డాక ఉడికించిన పప్పు వేయాలి. ఇందులో కారంపొడి, తగినంత ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి. కందిపప్పు ఆనపకాయ ఆనపకాయ/సొరకాయ పప్పు 200 గ్రా.లు 250గ్రా.లు కావలసిన వస్తువులు కొత్తిమీర చింతపండు 1 ఉప్పు కొద్దిగా నిమ్మకాయంత తగినంత 3 ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ 1/4 టీస్పూన్ నూనె 2 టీ స్పూన్లు - 1 టీస్పూన్ 1 టీస్పూన్ ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కారంపొడి కరివేపాకు తయారుచేసే విధానం 2 రెబ్బలు కందిపప్పు కడిగి నీళ్ళు పోసి, పసుపు, కొంచెం నూనె వేసి ఉడికించాలి. పప్పు సగం ఉడికిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, కారంపొడి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు రెక్కలు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఉప్పు, ముక్కలు కలిపి బాగా ఉడికిన తర్వాత దింపేయాలి. చిన్న గిన్నలో నూనె నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పప్పులో కలపాలి. తెలంగాణ రుచులు 86