Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలకూర పెసరపప్పు కావలసిన వస్తువులు పెసరపప్పు పాలకూర పచ్చిమిర్చి 200 గ్రా.లు 1 కప్పు 4-5 ఉల్లిపాయ పసుపు - తయారుచేసే విధానం 1 1/4 టీస్పూన్ ఉప్పు వెల్లుల్లి తగినంత 4 రెబ్బలు ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ ఎండుమిర్చి 3 నూనె 3 టీ స్పూన్ లు పెసరపప్పు కడిగి నీళ్లు పోసి చెంచాడు నూనె, పసుపు వేసి ఉడికించాలి. పప్పు సగం ఉడికిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి, సన్నగా తరిగిన పాలకూర వేసి కలిపి ఉడికించాలి. పప్పు, పాలకూర పూర్తిగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసి కలిపి దింపేయాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త వేగాక పొట్టు తీసి నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కాస్త ఎర్రబడ్డాక పప్పులో వేసి కలపాలి. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. పులిసింత కూర పప్పు కావలసిన వస్తువులు కందిపప్పు/పెసరపప్పు 200 గ్రా.లు పులిసింత కూర 1 కప్పు ఉల్లిపాయ 1 కరివేపాకు కొత్తిమీర ఉప్పు - పచ్చిమిర్చి 3 పసుపు 1/4 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర వెల్లుల్లి - - 1 టీస్పూన్ నూనె 2 రెబ్బలు కొద్దిగా తగినంత 1/4 టీస్పూన్ 3 రెబ్బలు కారంపొడి తయారుచేసే విధానం - 3 టీస్పూన్లు కందిపప్పు లేదా పెసరపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి పసుపు, చెంచాడు నూనె వేసి ఉడికించాలి. పప్పు సగం ఉడికిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి, తరిగిన పులిసింత కూర వేసి ఉడికించాలి. తర్వాత కారంపొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి ఉడికించి దింపేయాలి. చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించి పప్పులో కలపాలి. తెలంగాణ 85 రుచులు