Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కందిపప్పు వంకాయలు 200 గ్రా.లు 100 గ్రా.లు చిన్నది వంకాయ పప్పు కావలసిన వస్తువులు చింతపండు పులుసు 1/4 కప్పు పసుపు కారంపొడి 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ 3 ఉప్పు తగినంత 2 రెబ్బలు అల్లంవెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్ కొద్దిగా నూనె 3 టీస్పూన్లు తయారుచేసే విధానం కందిపప్పు కడిగి నీళ్ళు పోసి కాస్త నూనె, పసుపు వేసి ఉడికించాలి. వంకాయలు ముక్కలు తరిగి ఉప్పు నీళ్లలో వేయాలి. గిన్నె లేదా కడాయిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేపాలి. ఇందులో వంకాయ ముక్కలు వాటికి తగిన ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. తర్వాత ఉ డికిన పప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరి ఐదు నిముషాలు ఉడికించి కొత్తిమీర వేసి దింపేయాలి. చివరగా కొంచెం గరంమసాలా పొడి వేస్తే బాగుంటుంది. మామిడికాయ పప్పు కావలసిన వస్తువులు కందిపప్పు ఉల్లిపాయ 200 గ్రా.లు 1 టమాటా పచ్చిమిర్చి కరివేపాకు 3 ఉప్పు మామిడికాయ 1 1 తగినంత కొత్తిమీర పసుపు 2 రెబ్బలు కొద్దిగా 1/4 టీస్పూన్ నూనె ఆవాలు/జీలకర్ర 3 టీస్పూన్లు 1/4 టీస్పూన్ వెల్లుల్లి 4 రెబ్బలు 1 టీస్పూన్ కారంపొడి తయారుచేసే విధానం కందిపప్పు కడిగి నీళ్ళు పోసి, కొంచెం నూనె, పసుపు వేసి ఉడికించాలి. పప్పు సగం ఉడికిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, కారంపొడి, పసుపు, ఉప్పు వేయాలి. మామిడికాయ చెక్కు తీసి ముక్కలు చేసి లేదా తురిమి పప్పులో వేయాలి. అన్నీ కలిపి ఉడికిన తర్వాత దింపేయాలి. గరిటలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి వెల్లుల్లి నలక్కొట్టి వేయాలి. కాస్త వేగిన తర్వాత ఈ పోపును ఉడికిన పప్పులో వేసి కలపాలి. పైనుండి కొంచెం నెయ్యి వేస్తే మరింత రుచిగా ఉంటుంది. తెలంగాణ 82 రుచులు