11అందె : - అందెను ఇనుముతో తయారు చేస్తారు. లోపల చిన్న చిన్న గుండ్రని రాళ్లు లేదా ఇనుప గుళ్ళు వేస్తారు. వీటిని మగవారు తొడుక్కొని నృత్యాలు చేస్తారు. అడుగు కదిలినప్పుడు అందె నవ్వడితో నృత్యం కొనసాగుతుంది.
12డోలు కొయ్య:- డోలుకొయ్య మూడు అడుగుల పొడవు ఉంటుంది. కుడి ప్రక్క అడుగు, ఎడం ప్రక్క అడుగున్నర కైవారం కలిగి ఉంటుంది. దీన్ని డొల్లగా చెక్కి రెండువైపులా అంటే కుడిపక్క మేక చర్మంతోను మరొక ప్రక్క అంటే ఎడమవైపు గొడ్డు చర్మంతోను మూస్తారు. వాటిని తాళ్ళతో బిగిస్తారు. డోలును మగవారు తాడు కట్టుకొని మెడలో వేసుకుని కుడివైపు చేతితో ఎడమవైపు సిర్ర కర్రతో వాయిస్తారు.
13తూత కొమ్ము:- దీన్ని అడవి దున్న కొమ్ముతో తయారుచేస్తారు. ఒకటిన్నర అడుగు పొడవు కలిగి అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. ఊదే వైపు సన్నగా మరోవైపు వెడల్పుగా ఉంటుంది. దీన్ని తాటి ఆకులతో తయారు చేస్తారు. వేట, నృత్యం సందర్భాల్లో దీన్ని వాయిస్తారు.
84