Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేడారానికి ఈశాన్య దిశగా ఉన్న చిలుకలగుట్ట వైపు పరుగెత్తింది.అది చూసిన కొందరు కోయలు ఆమెను అనుసరించారు. కానీ చిలకలగుట్ట దారి మలుపులో ఆమె మాయమైంది. చివరికి చిలకలగుట్ట సమీపాన ఒక నెమలి నారవృక్షం క్రింద పుట్ట దగ్గర పసుపు కుంకుమలతో ఒక భరిణె లభించింది. అప్పుడు వారికి “నా అవతారం పూర్తి అయ్యింది. ఇక నుండి నా గుర్తుగా కుంకుమ భరణి మిమ్మల్ని రక్షిస్తుంది" అనే మాటలు శూన్యం నుండి వినిపించాయి. కోయలు ఆభరిణెను అక్కడే భద్రపరిచి నిత్యం పూజలు చేయసాగారు. మాఘ శుద్ధ పౌర్ణమికి రెండు వారాల ముందు వచ్చే బుధ గురు వారాల్లో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. భక్తులు తమ మొక్కులను బెల్లం రూపంలో సమర్పించుకుంటారు. వారు దీన్ని బంగారం అంటారు. జాతరకు బయలుదేరే భక్తులు నడుముకు బియ్యం కట్టుకుంటారు. వడిబియ్యం సమ్మక్కకు ప్రీతి అని వారి విశ్వాసం. పురుషులైతే స్త్రీ వేషం వేసుకుని ఒడిబియ్యం కట్టుకొని వచ్చి మొక్కు చెల్లించుకుంటారు. ఎదురు కోళ్లను సమర్పించడం మరొక రకమైన మొక్కు, సమ్మక్క సారలమ్మలకు ఎదురుగా కోళ్లను ఎగరేసి ఆ కోళ్లను దేవతలు చూశారనే భావనతో వాటిని బలి ఇస్తారు. దేవతలకు గొర్రెలను బలి ఇవ్వడం, మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడం గిరిజనులు పవిత్ర కార్యంగా భావిస్తారు.

75