10“దబడామారేవాళో -
క్వార భీగ? గ్వారఛీ?
దబడా మారఛ్వార అకలేతి,
తారినకల భంజావు బగలేతి.”
'డప్పు కొడుతున్న ఓ అబ్బాయీ! నీవు లంబాడీవా? వేరే వాడివా? డప్పు సరిగా కొట్ట లేకుంటే నీ పని అవుతుంది' అని పై పాటలోని భావం.
లంబాడీ నృత్యానికి అనుగుణంగా లంబాడీలు మాత్రమే డప్పు వాయించగలుగుతారనే విషయం ఈ పాట వల్ల తెలుస్తుంది. డప్పును సరిగా మోగించకపోతే నృత్యం చేయడానికి ఎవరికైనా సాధ్యం కాదని లంబాడీలు భావిస్తారు. అంతేగాక అన్నివాద్యాలలో డప్పు లంబాడీలకు ముఖ్యమైనది.
లంబాడీలు పెళ్ళికి ముందే కన్నె పిల్లలకు ఏడవడం నేర్పిస్తారు. దీన్ని వారు తమ భాషలో “ధాన్లో” అంటారు. లంబాడీ వధువు పెళ్లి అయి అత్తవారింటికి వెళ్లేటప్పుడు పరిపరి విధాల విలపిస్తుంది. ఆ విలాపం పాట రూపంలో ఇలా ఉంటుంది.
11"పూలజె పాలేలియ, జీవడాన పగరే మాయి,
మాతె ఘాలో యాడీయో! పూలాడారో, పోసేనే, కాగదేరో, ఆచో జీవడ!!
ఆన భోళె, జీవడాన, ఫగరే మా, మతె ఘాలో యాడీయో,”.
ఓ అమ్మలారా! పువ్వు లాంటి మనసు నాది. నన్ను పెళ్లి అనే కష్టాల కడలిలోకి నెట్టి వేయకండి. పూలరెమ్మ లాంటి స్వచ్ఛమైన అమాయకురాలిని. నన్ను అప్పుడే కష్టాల్లో తోయకండి' అనేది ఈ పాటలోని భావం. అత్తగారింటికి పోయే ఆడపిల్ల మనోభావాలకు అద్దం పట్టినట్లు ఉంటుందీ పాట.
వరుడు అత్తవారింటికి బయలుదేరే సమయంలో పాడే ఈ క్రింది పాట ఎంతో సంస్కారవంతమైన సందేశాన్ని అందిస్తుంది. వరుడికి సంబంధ బాంధవ్యాల మీద మంచి అవగాహన కల్పిస్తుంది.
12“అంగ ఛయే సారి ససరేరో మళావో
హత జోడి రామిరామి కరలేరయే పంతమేరో పంతియా!
లారె ఛయే తారె బాపూరో మళావో,
హటో ఫర ఝాలో దేలారే పంతమేరో పంతియా!!"
ఓ పెళ్ళికొడుకా! ముందు నీ మామగారి బలగం ఉంది. వెనుక నీ తండ్రి బలగం ఉంది. నీవు వెళ్లి వారితో సంబంధం కలుపుకో. ఐదుగురు కలిసి వేయించిన బంధాన్ని దేవుడు కూడా విడదీయలేడు. నీవు వెనక్కి తిరిగి అందరికీ వీడ్కోలు చెప్పు. నీకు విజయం తథ్యం' అని ఈ పాటలోని భావం.
జోల పాటలు ప్రతి తల్లి తన బిడ్డల కోసం పాడుతుంది. అలాగే తన బిడ్డ అమాయకత్వాన్ని తెలుపుతూ లంబాడీ తల్లి ఇలా పాట పాడుతుంది.
13"హాలో హాలో కన్ ఝగలా సిడాయి మ!
సోజో సోజో కన్ జాంగియా సిడాయి మ!
64
64