వేస్తుంది.
వధూవరులు పెంటకుప్పకు మొక్కే ఆచారం: లంబాడీ వరుడు పెళ్లికి ముందు కొన్ని నెలలు అత్తవారింట్లో ఉండే ఆచారం ఉంది. అప్పుడు అతడు తనతో ఒక సేవకుని వెంట తీసుకుని వెళతాడు. ఆ సేవకుడు పొరపాటుగా కూడ వధువుని చూడకూడదు. పూర్వం ఒక వరుడు రాయమల్ అనే సహాయకుడిని తన అత్తవారి ఇంటికి తీసుకొనివెళ్లాడట. అప్పుడు ఆ సేవకుడు వధువును చూశాడని వానిని చంపి బొంద పెట్టారట. ఆ తర్వాత ఆ బొంద గడ్డపై జిల్లేడు చెట్టు మొలిచిందట. ఆ విషయం తెలిసిన రాయమల్ భార్య పంచాయతీ పెట్టిందట. ఆ పంచాయితీలో ఆమె కోరిక మేరకు జిల్లేడుచెట్టును పెళ్లిపందిరికి కట్టడం అనే ఆచారం చేశారట. వరునికి సహాయకులుగా ఢాడి జాతి వారు ఉంటారు. ఢాడీ జాతి స్త్రీల చీరను కట్టుకుంటారు. అలాగే వధువు చీర కట్టుకొని వెళ్లి ఎక్కడ జిల్లేడు చెట్టు పెరుగుతుందో అక్కడ రాయమల్ సమాధిగా భావించి మొక్కడం అనే ఆనవాయితీ ఏర్పడింది.
పెళ్లితంతు:- పెళ్లి పందిరిని వధువు ఇంటి ముందు వేస్తారు. తొమ్మిది మూరల పొడవుతో చతురస్రాకారంలో నాలుగు గుంటలు తవ్వుతారు. మధ్యలో రెండు గుంటలు తవ్వుతారు. గుంటల్లో ఐదు పైసల బిళ్ళలువేసి, నాలుగు గుంటల్లో గుంజలు పాతి పందిరి వేస్తారు. మధ్యలోని రెండు గుంటలలో రెండు రోకళ్ళు పాతి పెడతారు. నాలుగు గుంజల దగ్గర దొంతరలుగా పేర్చిన ఏడు లేదా తొమ్మిది కుండలను (పోలుముంతలను) పేర్చి జిల్లేడు కొమ్మలతో అలంకరించి తాళ్లతో కట్టి పెడతారు. చుట్టూ ధాన్యం పోసి మధ్యలో వధూవరులను కూర్చోబెట్టి ఏడు వరుసల దారాన్ని పోలుముంతల చుట్టూ కడతారు. తర్వాత ఈ దారాన్ని తెంపి వధూవరుల చేతులకు కడతారు. ఆ తర్వాత వధూవరు లను రోకళ్ళచుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. ఈ ప్రదక్షిణంతో వధూవరులు ఒకటై నట్లు భావిస్తారు. అనంతరం వారికి పెరుగన్నం తినిపిస్తారు. ఒక తొట్టిలో గంజి పోసి కంచు పళ్ళాన్ని అటు ఇటు విసిరి వేయిస్తారు. గంజిలో ఉంగరాలు, గవ్వలు, నాణాలు వేసి వధూవరులను బయటకు తీయ మంటారు. వివాహానంతరం వధువుకు అత్తింటివారు గాజులు, పాపిట బొట్టు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు కాలివేళ్ళకు రింగులు ధరింప చేయిస్తారు.
లంబాడీలలో అంపకాల కార్యక్రమం ప్రత్యేకంగా ఉంటుంది. వధువును చక్కగా అలంకరించి ఎద్దు పైకి ఎక్కిస్తారు. వధువు అత్తగారి ఇంటికి చేరిన తర్వాత తెల్లవారుజామున ఒక ఇత్తడి చెంబులో వేప పుల్లలు వేసుకొని తండాలోని ఇంటింటికి పోయి వేప పుల్లను అందిస్తుంది. దీనివల్ల తండా వాసులందరికీ వధువు పరిచయమవుతుంది.
లంబాడీలలో బహుభార్యత్వం ఉంది. వీరిలో కన్యాశుల్కం ఆచారం ఇప్పటికీ ఉంది. ఆడపిల్లలను అమ్ముకునే దుస్థితి ఉంది. పునర్వివాహం స్త్రీపురుషులిద్దరికీ ఉంది. లంబాడీ స్త్రీలు భర్త చనిపోతే భర్త సోదరుని వివాహం చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది.
అంత్యక్రియలు:- లంబాడీలు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు హిందూ ఆచారం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహిస్తారు. వీరు పునర్జన్మ గురించి నమ్మకాన్ని కలిగి ఉంటారు. కర్మకాండ అయిపోయిన తర్వాత చితాభస్మంలో ఏవైనా అడుగుల ముద్రలు కనిపిస్తాయేమోనని వీరు పరిశీలిస్తారు. ఒకవేళ మనిషి పాదాల ముద్రలు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి మళ్ళి మనిషి జన్మ ఎత్తినట్లుగాను, లేదా జంతువు పాదముద్రలు కనిపిస్తే జంతువు జన్మ ఎత్తినట్లుగాను నమ్ముతారు.
59