Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాసులంతా గుండ్రంగా కూర్చుంటారు. తీసజ్ నారును తెంపి మొదట నాయకుని తలలో పెడతారు. తర్వాత మిగతా వారి తలపాగాలో పెడతారు. సాయంత్రం తీజ్ బుట్టలను నీటిలో నిమజ్జనం చేస్తారు. తీజ్ బుట్టలు పెట్టిన ఇంటి ముందు ఉయ్యాలలు కట్టి అమ్మాయిలు ఉయ్యాలలూగుతూ పాటలు పాడతారు.

దసరా పండుగను లంబాడీలు “దసరావ్” అంటారు. వీరు ఈ పండుగకు తుల్జాభవానిని పూజిస్తారు. లంబాడీలు దసరా ముందు వెనక వచ్చే మంగళ గురువారాల్లో తిధి నక్షత్రాలతో పనిలేకుండా ఉత్సవాలు జరుపుకుంటారు.

దీపావళి పండుగను లంబాడీలు “దవాళి” లేదా “కాళీ అమాస్” అంటారు. ఈ పండుగకు వీరు గోలక్ష్మిని పూజిస్తారు. గోవును పూజించడం వల్ల లంబాడీలు కిషన్ కన్నయ్యను ( కృష్ణుని) పూజించినట్లుగా భావిస్తారు.

లంబాడీలు హెూలీ పండుగను పదిహేను రోజులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీన్ని వీరు సంతాన ప్రాప్తిని కలిగించే పండుగగా భావిస్తారు. ఈ పండుగ రోజు హెూలీ పాటలు పాడుతూ డప్పు దరువుకి అనుగుణంగా నృత్యం చేస్తారు. హెూలీ పాటలను పండుగ రోజు తప్ప ఇతర రోజుల్లో పాడకూడదని అలా పాడితే శరీరం మీద దురద లేస్తుందని లంబాడీల నమ్మకం.

లంబాడీలు మహాపురుషులను కూడా పూజిస్తారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, హతీ రామ్ బాబాజీ అనే వీరిద్దరిని తమ జాతి లో పుట్టిన మహాపురుషులుగా, గొప్ప తత్వవేత్తలుగా భావించి పూజిస్తారు.

అతిధి మర్యాదలు:- లంబాడీలు అతిథుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలను ప్రదర్శిస్తారు. ఎవరినైనా “రామ్ రామ్ భయ్యా!" అంటూ మర్యాదగా పలకరిస్తారు. చాలా రోజుల తర్వాత ఇంటికి బంధువులు వస్తే వాళ్ళని పట్టుకుని ఏడుస్తారు. అలాగే అతిథులను సాగనంపేటప్పుడు వారిని పట్టుకొని ఏడుస్తారు. తిరుగు ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు, తమ వద్ద ఉన్న ధాన్యం బియ్యం జొన్నలు ఇచ్చి, ప్రయాణ ఖర్చులకు ధనాన్ని కూడా ఇచ్చి పంపిస్తారు.

నమ్మకాలు:- లంబాడీలకు మూఢనమ్మకాలు ఎక్కువ. మంత్రగాళ్ళు చేతబడులు చేస్తారని నమ్ముతారు.దయ్యాలు భూతాలు ఉన్నాయనే విశ్వాసం వీరిలో కనిపిస్తుంది. పండుగల సందర్భాల్లో దేవతలకు బలి ఇస్తే వారు శాంతించి కరువు కాటకాలు వంటి ప్రకృతి బీభత్సాలు జరగవని భావిస్తారు. వీరు శకునాలను కూడా విశ్వసిస్తారు.

e), ఆచార వ్యవహారాలు:-

జననం:- తండాలో ఒక ఇంట్లో ఆడశిశువు జన్మిస్తే ఆ ఇంట్లో కంచు పళ్ళాన్ని మోగిస్తారు. మగ శిశువు జన్మిస్తే తండా నాయకుని ఇంట్లో ఉండే నగారాను మోగిస్తారు. దీనివల్ల తండాలోని వారందరికీ ఎవరింట్లో ఏ శిశువు జన్మించింది తెలుస్తుంది. శిశువుకు ఆవుపేడను పూసి నీళ్ళతో స్నానం చేయిస్తారు. అలా చేయడం వల్ల పుట్టిన బిడ్డ శరీరంపై ఉన్న రోమాలు రాలిపోయి శిశువుకు ఆరోగ్యం కలుగుతుందని లంబాడీల నమ్మకం. తర్వాత తల్లీ బిడ్డలకు వావిలాకు వేపాకు వేసి మరగబెట్టిన నీటితో స్నానం చేయిస్తారు. విజ్ఞాన శాస్త్ర రీత్యా ఆవు పేడలో అమోనియా ఉంటుందని, వావిలాకు, వేపాకు క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయని తెలుస్తుంది. కాన్పు జరిగిన మూడవరోజు జలమాత పూజ చేస్తారు. ఇంటికి తూర్పు దిక్కున ఒక గుంట తవ్వి దాని మీద రేగుకంపను పెడతారు. ఇత్తడి చెంబుకు నల్లని వెంట్రుకలు చుట్టి, పసుపు, సున్నం, బొగ్గుతో బొట్లు పెట్టి, నీరు నింపి, ఐదు సంవత్సరాల బాలునితో బాలింత తలపై పెడతారు. తండా స్త్రీలు అక్షింతలు చల్లుతూ ఉండగా బాలింత చెంబులోని నీళ్ళను గుంటలో పోస్తుంది. పిండి ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగించి గుంట దగ్గర పెడుతుంది. తండా స్త్రీలు కొడవలితో ఏడు గీతలు గీసి, బాలింత

57