చెంచుల నృత్యాలు
వేట నృత్యాలు:-చెంచులు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో నివసిస్తున్నారు. వీరు కాలాన్ని - ఋతువులను బట్టి ఆహారం కొరకు తిరుగుతూ ఉంటారు. వీరు స్థానిక సమస్యల మీద నోటికి వచ్చినట్లుగా అప్పటికప్పుడే పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. డప్పు చప్పుడును బట్టి ఎవరికి తోచినట్టు వారు గంతులు వేస్తారు. సంవత్సరానికోసారి ఇప్పపువ్వు సారాయి లభించే కాలంలో బాగా తాగి ఒళ్ళెరుగని ఆనందంతో నృత్యాలు చేస్తారు. వీరు చేసే నెమలి నృత్యం, నల్ల కోతి నృత్యం అనే నృత్యాలలో వీరి వేట విధానం ప్రదర్శితమవుతుంది.
3పులినృత్యం:-ఒక సమర్థుడైన వ్యక్తి తన శరీరం నిండా పులిచారులను వేసుకుని, ముఖానికి పులి తొడుగును ధరించి పులి వలె పెద్ద పెద్ద అడుగులు వేస్తూ మృదంగానికి డప్పుకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేయడం పులినృత్యం. సాధారణంగా పులినృత్యాన్ని ఒకే వ్యక్తి చేస్తాడు. కానీ అప్పుడప్పుడు ఒకరి కంటే ఎక్కువమంది కూడా ఈ పులి నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
4నెమలి నృత్యం:-చెంచులకు నెమలి నృత్యం ఎంతో ప్రీతికరమైనది. ఇదొక వేట నృత్యంగా ప్రదర్శిస్తారు. విల్లంబులు ధరించి నెమళ్ళను వేటాడినట్లుగా అవి తప్పించుకున్నట్లుగా నృత్య ప్రదర్శన ఉంటుంది. దీన్ని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. ఎందుకంటే మగ నెమళ్ళు మాత్రమే అందంగా పురివిప్పి నడుస్తాయి. కాబట్టి వేట పురుషులు మాత్రమే చేస్తారు. కనుక ఇందులో పురుషులు పాల్గొనడం సహజం. ఈ నృత్య ప్రదర్శన సాదాసీదాగా ఊహాశక్తితో కూడి ఉంటుంది. దీనికి ఒక నియమ నిబంధనలు అనేవి ఏమీ ప్రత్యేకంగా ఉండవు.
44