Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలంగాణ గిరిజనులు చెంచులు

తెలంగాణలోని నల్లమల అడవుల్లో చెంచులు నివసిస్తున్నారు. వీరు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. వీరిలో రెండు రకాల వారు ఉన్నారు. కొందరు అరణ్యాల్లో నివసిస్తున్నారు. వీరిని అడవి చెంచులు లేదా కొండచెంచులు లేదా దేవచెంచులు అంటారు. కొందరు అరణ్యాల బయట నివసిస్తున్నారు. వారిని ఊరు చెంచులు లేదా బొంత చెంచులు లేదా కృష్ణ చెంచులు అంటారు. ఈ ఊరు చెంచులు సంచార జీవులు. వీరు ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటికి వలస పోతుంటారు. కానీ చెంచులలో ఎక్కువ మంది అడవుల్లోనే నివసిస్తున్నారు. చెంచుల మాతృభాష తెలుగు.

1ప్రాచీన కాలం నాడే సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన చెంచులు నేడు పేదరికంలో మగ్గుతున్నారు. చారిత్రకంగా చెంచుజాతికి సంబంధించినన్ని ప్రస్తావనలు ఏ గిరిజన జాతికి లేవు. చెంచులకు సంబంధించిన ఎన్నో చరిత్ర పూర్వ విశేషాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. చెంచుల కుటుంబ గాథలు, శ్రీశైలం స్థల పురాణం, శ్రీశైలం గుడి ప్రాకారాలు మీద బొమ్మలు, పాల్కురికి సోమనాథుని రచనలు, ప్రొఫెసర్ భౌమిక్ గారు, హేమండార్ఫ్ గారు, వి.ఎన్.వి.కె. శాస్త్రిగారు చెంచుల గురించి రాసిన పుస్తకాలు, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలు రీసెర్చ్ ఆఫీసర్ గా పనిచేసిన కీర్తిశేషులు రమణరావుగారి పరిశోధనలు, శ్రీశైలంలోని తెలుగు విశ్వవిద్యాలయం వారి పరిశోధనలు అన్నీకూడా చెంచుల ప్రాచీన చరిత్రను తెలుపుతున్నాయి. మనుస్మృతిలో ఆంధ్రులతోపాటు చెంచుల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ప్రస్తావన చెంచుల ప్రాచీనతను నిరూపిస్తుంది. చెట్ల కింద నివసించేవారు కనుక చెంచులు అనే పేరు వీరికి వచ్చినట్లుగా అయ్యప్పన్ అనే మానవ శాస్త్రవేత్త పేర్కొన్నారు. 'చుంచు' ఎలుకలు తినేవారు కాబట్టి వారిని చెంచులు అంటారని కొందరు చెప్తారు. చెంచులు శ్రీలంకలోని వడ్డాజాతితో సామ్యత కలిగినవారిని మరికొందరు చెప్తారు.

చెంచుల సంస్కృతి

నల్లమల అడవుల్లో చెంచులు నివసిస్తున్నారు. ఈ అడవుల్లో చేతిలో విల్లంబులు, పెద్ద కత్తి, భుజంమీద గొడ్డలి, వీపు మీద బుట్టతో నడుస్తున్న భర్త వెనక చంకలో లేక కొంగుమడతలో చంటి బిడ్డను ఎత్తుకుని, నెత్తిమీద ఆహారం, నీళ్ళు కలిగిన బుట్టను పెట్టుకొని నడుస్తున్న భార్య, ఆ వెనుక కాపలా కుక్కతో తిరుగుతూ కనిపించే వారే చెంచులు. వీరు అంత పొడవు పొట్టికాని ఎత్తుకలిగి సన్నగా ఉంటారు.

2(a). జీవనవిధానం

చెంచులు తమ గుడిసెలను శంఖు లేదా త్రిభుజాకారంలో నిర్మించుకుంటారు. భూమిపై నాలుగైదు అడుగుల వరకు తడికలతో గుండ్రంగా నిర్మించి, దాని పైన “కోనికల్ " ఆకారంలో గడ్డితో పైకప్పు వేసుకుంటారు.

39