Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పాటలో ఒక తల్లి తన బిడ్డ ఒక రాజకుమారుడుగా సౌఖ్యాలను పొందాలని ఆశిస్తుంది. వెండి గిన్నెలో అన్నం పెట్టి రత్నాల చెంబుతో నీళ్లు తాగిస్తానని చెప్పడంలో ఒక తల్లి గొప్ప మనసు తెలుస్తుంది. నిజానికి ఎరుకల వాళ్లకు అంత స్థోమత లేకపోయినా తల్లి ఊహల్లో బిడ్డ గురించిన గొప్ప భావన ఈ పాటలో కనిపిస్తుంది. ఇలా ఎరుకల వారి పాటలు భక్తి, శ్రామిక, కుటుంబ, పౌరాణిక గేయాలు మౌఖికంగానే సాగిపోతుంటాయి. ఈ పాటల సృష్టికర్త ఎవరో అజ్ఞాతకవిగా ఉంటాడు. పాటల్లో ఎరుకల సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఎరుకల సంగీత వాద్యం

18 సోదె బుర్ర:- ఎరుకలసాని ఉపయోగించే సోదివాద్యాన్ని సోది బుర్ర అని అంటారు. దీన్ని వాయిస్తూ ఎరుకల స్త్రీ సోది చెప్తుంది. దీన్ని తయారు చేయడానికి గుండ్రని సొరకాయను ఎంపిక చేసుకొని దాన్ని బాగా ఎండబెడతారు. తర్వాత దానిలో ఉన్న పిప్పిని తీసివేసి దాన్ని డొల్లగా చేస్తారు. దానికి ఒక వెదురు కర్రను అనుసంధానం చేస్తారు. వెదురు కర్రకు మూడు వెదురు పుల్లలను బిగిస్తారు. ఈ రెండిటిని కలుపుతూ ఇనుప తీగను చుడతారు. సోదిలో ఒక రకమైన సంగీతం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ సోది బుర్రను వాయిస్తారు.

ఆధార గ్రంథాలు

1. ఎరుకల సంస్కృతి సాహిత్యం- పుట, సంఖ్య - 17
2. శ్రీ మహాభాగవతం, చతుర్థ స్కంధం, పద్యాల సంఖ్య - 395-434,
3. ఎరుకల సంస్కృతి సాహిత్యం- పుట సంఖ్య - 23.
4. ఎరుకల సంస్కృతి- డాక్టర్. బి. భీమమ్మ, (ఎరుక)
5. మ్యూజిక్ -డాన్స్ అండ్ మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్ డ్యూరింగ్ నాయక పీరియడ్ - పుట సంఖ్య- 141.
6. మిసిమి, మాసపత్రిక, సంపుటి-29 పుట సంఖ్య - 78.
7. మిసిమి, మాసపత్రిక, సంపుటి-29 పుట సంఖ్య-79.
8. ఎరుకల సంస్కృతి సాహిత్యం- పుటల సంఖ్య - 221-223.
9. ఎరుకల సంస్కృతి సాహిత్యం- పుట సంఖ్య-229.
10. ఎరుకల సంస్కృతి సాహిత్యం- పుట సంఖ్యం 229.
11. ఎరుకల సంస్కృతి సాహిత్యం-పుట సంఖ్య - 234.
12. ఎరుకల సంస్కృతి సాహిత్యం-పుటల సంఖ్య-266-270.
13. ఎరుకల సంస్కృతి సాహిత్యం-పుటల సంఖ్య 290,291.
14. ఎరుకల సంస్కృతి సాహిత్యం-పుటల సంఖ్య- 276,277.

37