భక్తి ప్రధానమై ఉంటుంది. నృత్య విధానంలో స్త్రీలు పురుషులు వేరువేరు వరుసలుగా అభిముఖంగా నిలబడి ఒకరి భుజాలపై ఒకరి చేతులు వేసుకొని కలిసికట్టుగా అడుగుల్ని కదుపుతారు. అడుగుల్ని కదపడంలో కుడి ఎడమ అనే భేదంతో ఒక లెక్క ప్రకారం నృత్యం చేస్తారు.
7కోలాటం నృత్యం:- ఎరుకల వారి కోలాటం ఎంతో అందంగా ఉంటుంది. వీరు స్త్రీ పురుషులు కలిసికట్టుగా పర్వదినాల్లో చేసే ఈ కోలాటం నృత్యానికి ప్రత్యేక శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఒకే రంగు వస్త్రాలు ధరిస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. స్త్రీలు ప్రత్యేకంగా కొప్పులు పెట్టుకొని పూలు పెట్టుకుంటారు. కోలాటం సమయంలో కర్రలను మాత్రమే ఉపయోగిస్తారు. స్త్రీ పురుషులు గుండ్రంగా తిరుగుతూ ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనకకు వేస్తూ, తమకు అటు ఇటు ఉండే వారి కర్రలను కొడుతూ నృత్యం చేస్తారు.
ఎరుకల సంగీతం
ఎరుకల పాటల్లో సాధారణంగా ఒక దరువు పదం ఉంటుంది. ఆ పదం పాటకు ఒక ఊపునిస్తుంది. ఎన్నియాలో, ఉయ్యాలో, స్వామి, శివయ్య, అంటూ ఈ దరువు పదాలు ఉంటాయి. ఎరుకల పాటల్లో సామాజిక అంశాలు, వృత్తికి సంబంధించిన అంశాలు, భక్తి గీతాలు, మానవ సంబంధాలను తెలిపే విషయాలు కనిపిస్తాయి. సామాజిక అంశాన్ని తెలిపే ఈ పాటలో త్యాగభరితమైన ఒక స్త్రీ జీవితం కనిపిస్తుంది.
8"కర్త రాజా! కర్త రాజా! ఎన్నియలో,
కర్త రాజుకు నా లేరు
మక్కుమరుగ ఎన్నియలో,
అయ్యనా లేరు అన్నదెమ్మి మారుగా ఎన్నియలో,
మల్లె కట్ట వోడుతకోనూ.......
ఈ పాటలోని అంశం ఒక కథా రూపంలో చెప్పబడింది. ఆ కథ ఇలా ఉంది. నల్లరాజుకు నలుగురు కొడుకులు. వాళ్ళు చెరువుకు కట్టవేస్తుంటే అది నిలవడం లేదు. గంగమ్మకు ఎన్నో మొక్కుకున్నారు. కోడిని, మేకను బలి ఇస్తామన్నారు. కానీ కట్ట ఆగలేదు. "నిలువలేను నిలవలేను నల్లరాజా అని గంగమ్మ" అన్నది. అప్పుడు నల్లరాజు కొడుకులు తమ చెల్లెలు శాంతమ్మను బలి ఇస్తామన్నారు. అది విని శాంతమ్మ ఏడుస్తూ "ఆడపిల్ల లేకుంటే ఈ సృష్టి లేదు. మీరైనా చెప్పండి" అని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ ప్రయోజనం లేదు. ప్రకృతిలోని చెట్టు పుట్టలకు, ఆకాశంలో పోయే పక్షులకు మొరపెట్టుకున్నది. ఆమె రోదన అరణ్య రోదనే అయింది. ఇది సమాజంలో ఆడపిల్లల పరిస్థితికి నిదర్శనంగా కనిపిస్తుంది. కానీ పాట చివరలో "ఆడపిల్ల బతికి మన ఇల్లు నిండాలి” అనే నీతి వాక్యం ఉండడం వల్ల ఈ పాటలోని పరమార్ధం అర్థమవుతుంది. ఆడపిల్ల సృష్టి మనుగడకు ముఖ్యమైనదనే సందేశం ఈ పాటలో కనిపిస్తుంది.
ఎరుకల వాళ్ళు తమ కులవృత్తులను ఆచరిస్తున్న సమయంలో పాడుకునే పాట వాళ్ళ మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇతర పాటల కంటే ఈ పాట అందించే చైతన్యం చాలా గొప్పగా ఉంటుంది.
34