01. తెలంగాణ గిరిజనులు ఎరుకలు
ఎరుకజాతి గిరిజనులు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నారు. వారు తమను తాము కుర్రుజాతి వారమని చెప్పు కుంటారు. ఎరుక స్త్రీలు సోదిచెప్పటం (త్రికాల విషయాలుచెప్పటం) మొదలు పెట్టిన తర్వాత వారు ఎరుకలుగా పిలవబడు తున్నారు. ఎరుక అంటే జ్ఞానం అని అర్థం. ఎరుకలకు ప్రత్యేకమైన భవిష్యత్తు వర్తమాన భూతకాల విషయాలు తెలియచేసే శక్తి ఉందని నమ్మకం. వారికి ఎరుకు భాష లేదా కుర్రు భాష లేదా కులవత అనే భాషా మాండలికం ఉంది. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. ఈ భాష ఎక్కువగా తెలుగు తమిళం కన్నడ భాషలకు దగ్గరగా ఉంటుంది. దీనికి లిపి లేదు. తెలంగాణలోని ఎరుకలు ఎక్కువగా తెలుగును మాట్లాడతారు.
ఎరుకలు వంశపారంపర్యంగా అనేక తెగలుగా ఏర్పడినారు. ఆ తెగలు వారి వృత్తుల ఆధారంగా ఏర్పడినవి. అవి
- 1. దబ్బ ఎరుకలు (వెదురు బొంగులను చీల్చి బుట్టలను తయారుచేసేవారు),
- 2. ఈతపుల్లల ఎరుకలు (ఈత పుల్లలతో బుట్టలు, గంపలు, తడికలు తయారుచేసేవారు),
- 3. కూచపురి ఎరుకలు (తాటినారతో, కలబందనారతో తాళ్ళు, ఉట్లు, నులక తయారు చేసేవారు),
- 4. ముగ్గు ఎరుకలు(ముగ్గు అమ్మేవారు),
- 5. వూరుఎరుకలు (యాచకులు),
- 6. కరివేపాకు ఎరుకలు (కరివేపాకు అమ్మేవారు),
- 7. ఉపుఎరుకలు (ఉప్పు అమ్మేవారు)8. కూటుఎరుకలు
- (ధాన్యం నిల్వ చేసే గరిసెలు లేదా గాదెలను తయారుచేసేవారు),
- 8. ఎద్దుల ఎరుకలు (గంగిరెద్దుల వాళ్ళు),
- 9. భజంత్రీ ఎరుకలు(నల్లకోటు వేసుకొని సన్నాయి ఊదుతూ దానం యాచించేవారు.),
- 10. కావలి ఎరుకలు (కాపలాదారులుగా పనిచేసేవారు),
- 11. బేరగాళ్ళు (గాడిదలు, ఎద్దుల వ్యాపారం చేసేవారు),
- 12. పాముల ఎరుకలు (పాములను ఆడించి దానం యాచించేవారు),
- 13. పిట్టల ఎరుకలు (పిట్టలను, ఉడుములను, కుందేళ్ళను పట్టుకొనేవారు).
ఎరుక తెగలలో సాతుపడి, కావాడి, మానుపాటి మేండ్రగుత్తి అని నాలుగు రకాల గోత్రాలవారు ఉన్నారు. వీరిలో సాతుపడి, కావాడి గోత్రాలవారు అధికులుగా భావిస్తారు. ఎరుకలతెగల్లో అనేక ఇంటిపేర్లు కలవారు ఉన్నారు. వారి ఇంటిపేర్లు కుంభ, మొగిలి, కట్టా, దేవర, శ్రీరామ, పాలపర్తి,మేడ మొదలైన విధంగా ఉంటాయి. ఎరుకతెగలో వివాహాలు ఒకే గోత్రం ఉన్నవాళ్ళమధ్య, ఒకే ఇంటిపేరు గలవాళ్ళ మధ్య జరగవు.
తెలంగాణలో ఎరుకజాతి వాళ్లు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నారు. అందులోను ముఖ్యంగా వనపర్తి, ముష్టిపల్లి, పెద్దకొత్తపల్లి, నాగర్ కర్నూల్, ఆత్మకూర్, నారాయణపేట్, పెబ్బేరు, తీగలపల్లి,
24