2515వ శతాబ్దానికి చెందిన కొరవి గోపరాజుకవి తన 'సింహాసన ద్వాత్రింశిక” కావ్యంలో చెంచు స్త్రీ పురుషుల వేషధారణను వర్ణించాడు. గురిగింజ పూసలను మెడలో ధరించి, అడవిమొల్ల పువ్వులను తలలో పెట్టుకుని, పారుటాకులను మొలకు కట్టుకొని వెళుతున్న చెంచు స్త్రీలను విక్రమార్కచక్రవర్తి చూచాడని పేర్కొన్నాడు. అలాగే ఈ కవి చెంచు పురుషుని వేషధారణను కూడా ప్రస్తావించాడు. విక్రమార్కచక్రవర్తి సభలోనికి పచ్చని అంగీని, నల్లని అంగవస్త్రాన్ని ధరించి, తమ్మి పూసల దండలను మెడలో వేసుకొని, ఎర్రని ధాతువు బొట్టు పెట్టుకొని, పిడి కత్తిని దట్టిలో బిగించుకొని, విల్లు అంబులను రెండు చేతులలో పట్టుకొని, నల్లని దేహం కలిగిన చెంచు వచ్చాడని కవి వర్ణించాడు.
2616వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” అనే గ్రంథంలో బోయవాళ్ళ స్వభావాన్ని ప్రస్తావించాడు. ఒక బోయవాడు ఒకరోజు తన మిత్రుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ పొయ్యి మీద కుండలో నార ఉడుకుతున్నది. ఆ బోయవాడు తన మిత్రుడు తన కొరకు మాంసం వండుతున్నాడని భావించాడు. కానీ మిత్రుడు మాంసం లేకుండానే భోజనం పెట్టడం చూచి ఆ బోయవాడు తన మిత్రుని చంపాలనుకున్నాడు. అంతలో పొయ్యి మీద నార చిమిడిపోతున్నదని మిత్రుడు అనగానే బోయవాడు తన మిత్రుడు తనకు ఏమీ తక్కువ చేయలేదని అతనిని చంపకుండా ఇంటికి వెళ్లిపోయాడు. చిన్న కారణానికి ఆటవికులకు కోపం వస్తుందని శ్రీకృష్ణదేవరాయల ప్రస్తావన వల్ల తెలుస్తుంది.
చెంచులు, బోయలు మొదలైన ఆటవికులు పాలన్నం పెట్టినంత మాత్రాన వారి యెడల సత్యం తప్పక ప్రవర్తిస్తారు. కానీ ఏ కాస్త పొరపాటు జరిగినా వెర్రివాళ్ళవలె ఒకే ఒక తప్పే కదా అని ఉపేక్షించ కుండా పగ పెంచుకుంటారు. కాబట్టి సత్యం తప్పని రాజు ఎడల ఆటవికులు అధీనులై విశ్వాసంతో ఉంటారని శ్రీకృష్ణదేవరాయులు ఆటవికుల స్వభావాలను స్పష్టం చేశారు.
2716వ శతాబ్దానికి చెందిన అల్లసాని పెద్దనకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులలో గొప్పవాడు. అతడు తన “మను చరిత్ర” కావ్యంలో ఎరుకలను గురించి ప్రస్తావించాడు. ఎరుకలు ధైర్య సాహసాలు కలిగినవారని పేర్కొన్నాడు. ఎరుకలు స్వరోచి మహారాజును వేటకు రావలసిందిగా ఆహ్వానిస్తూ అడవిపంది, ఏనుగు, పులి మొదలైన క్రూర జంతువులను తాము అవలీలగా చంపివేయగల మని ఎంతో ఆత్మవిశ్వాసంతో పలికినట్లు కవి వర్ణించాడు. వేటకు స్వరోచి మహారాజు బయలుదేరి నప్పుడు ఎరుకలు వేటకు అవసరమైన సెలకట్టెలు ( బాణాలు), విల్లులు, మోటకత్తులు (కొమ్మలు నరికే మచ్చుకత్తులు) మొదలైనవి తీసుకొని పోయారని, పులులను, ఎలుగులను, అడవిపంది, తోడేలు వంటి జంతువులను వేటాడినారని అల్లసాని పెద్దన కవి వర్ణించాడు. అలాగే ఆటవికులు స్వరోచిరాజుకు, మృగకస్తూరిని, జున్ను, చారపప్పును కానుకగా ఇచ్చినట్లు పెద్దన కవి పేర్కొన్నాడు.
28ధూర్జటికవి 16 వా శతాబ్దానికి చెందిన కవి. ఇతడు చెంచు స్త్రీల వేషధారణను తాను రచించిన “శ్రీ కాళహస్తి మహాత్మ్యం"లో విశేషంగా వర్ణించాడు. ఉడుమూరులోని చెంచు స్త్రీలు పట్టు వస్త్రాలు రత్నాభరణాలు ధరించ గల ధనవంతులైనా తమ కులాచారాన్నిబట్టి మెడలో గురిగింజ పూసలను, నడుముకు పారుటాకులను ధరించారని కవి పేర్కొన్నాడు. అలాగే కాటరేని (శివుని) జాతరకు వెళ్లే సమయంలో ఆయన చెంచు వనితల విశేష వస్త్రధారణను, అలంకరణలను గురించి ప్రస్తావించాడు. నుదుటిపై పట్టికను ధరించి, మంజీరాలతో కూడిన గురిగింజ పూసలను మెడలో వేసుకొని, కాండంతో కూడిన నెమలిపురి దండలను భుజాలకు కట్టుకొని, మయూరవర్ణాన్ని శరీరానికి పూసుకుని, నడుముకు పారుటాకులను కట్టుకొని, కొప్పులో పూలగుత్తులను అమర్చుకొని, పాదాల అంచులకు లాక్షారసాన్ని పూసుకొని, కళ్ళకు కాటుక పెట్టుకుని, కాటరేని (శివుని) జాతరకు చెంచు స్త్రీలు వెళ్లారని
16