నివసిస్తున్నారు.
"భద్రాచలానికి ఐదు కిలోమీటర్ల దూరం ముందే గోదావరిలో ఏర్పడిన మోతెగడ్డ అనే ద్వీపం మీద వెలిసి కోయ గిరిజనులు చేత ఆరాధింపబడుతున్న వీరభద్రుడు కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక పేర్కొనబడ్డాడు. అందులో గోపరాజు వర్ణించిన ఎనిమిది మంది స్త్రీల నృత్యం ఈనాటికీ కొనసాగుతున్న కొమ్ముకోయ నృత్యానికి సరిపోలుతుంది.
లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనిషి పరిణామం చెందుతూ వస్తున్నాడని అతడి మొదటి ప్రస్థానం ఆఫ్రికా ఖండంలో ప్రత్యేకించి తూర్పు ఆఫ్రికాలో ప్రారంభమైందని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు భూగోళ శాస్త్రజ్ఞుల ప్రకారం భూఖండం కదలికలను అనుసరించి భారత భూఖండం ఆరు లక్షల సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికా నుండి విడిపోయి రష్యా చైనా భూఖండానికి ఆనుకుంది కాబట్టి విడిపోయిన మనుషులకు అంటే తూర్పు ఆఫ్రికా ప్రజలకు భారత మూల ప్రజలకు మధ్య పోలికలు ఉన్నాయని మానవ శాస్త్రవేత్తలు తేల్చారు. అలాంటి మూలవాసులు గోదావరి లోయలో లక్షల సంవత్సరాలుగా నివసిస్తూ క్రమక్రమంగా తమకంటూ ఒక ప్రత్యేకమైన జీవన సంస్కృతిని ఏర్పరచుకున్నారని ప్రాచీన ఆదివాసుల ఉనికికి సంబంధించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆధార గ్రంథాలు
- 1. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య- 15-17.
- 2. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య - 28-31.
- 3. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య - 18, 21.
- 4. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య - 22, 24.
- 5. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య 25-27.
- 6. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య- 45, 48.
- 7. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య - 51-53.
- 8. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య - 57, 58.
- 9. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య - 109,110.
- 10. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య - 147-148.
- 11. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య- 136-137.
- 12. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య - 135.
- 13. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, పుటల సంఖ్య- 139.
10