ఇక్కడే. ఈ ద్వీపం చుట్టూ రెండువేల సంవత్సరాల కంటే ముందు నుంచే మనుగడలో ఉన్న కోట, ఆ కోటకు చేరుకునేందుకు నిర్మితమైన రహదారి ఉన్నాయి. కోటకు దక్షిణంగా జలపాతాలు దూకుతున్నాయి. బంగారమ్మ అనే ఈ కనకాయి శాకాహార దేవతను ఆంధ్రులకు మూలపురుషులైన అంధ్ జాతి గిరిజనులు పూజిస్తున్నారు.
“పద్మల్ పూరి కాకో” అని ఆదిలాబాద్ గోండు గిరిజనుల చేత పూజింపబడుతున్న దేవత తీర్థ క్షేత్రం ఖానాపూర్ దగ్గర గోదావరి ఒడ్డునే ఉంది. కాకో అంటే గోండు భాషలో అమ్మలగన్న అమ్మ అని అర్థం. “పద్మ పత్ర విశాలాక్షి, పద్మకేసర వర్ణిని” అని ఈ సరస్వతీదేవిని ఇక్కడ గోండులు స్తుతించడం విశేషం. ప్రతి సంవత్సరం గోండు గిరిజనుల గుస్సాడీ నృత్య బృందాలు ఈ కాకో దేవత దగ్గరకు వచ్చి తమకు శక్తిని ఇవ్వమని వేడుకుంటారు. రెండున్నర వేల సంవత్సరాల నాటి “సుత్తనిపాత” అనే గ్రంథంలో కాకో దేవత గురించి ఉంది. అలాగే గుస్సాడీ నృత్యం చేసేవాళ్లు జటాజూటాలు, అజినాలు (జింక చర్మాలు) సుత్తనిపాతలో పేర్కొన్నట్లుగానే ధరిస్తారు. గోదావరి ప్రాంతాన్ని “గోడావరి” అంటే గోండుల ప్రాంతపు నది అని స్థానిక ప్రచారంలో ఉంది.
గోండులు ఏడు తలల పామును ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లోను, గాంధారికోటలోనూ కొలుస్తారు. ఖానాపూర్ కి తూర్పున యాభై కిలోమీటర్ల దూరంలో గోదావరి ఉత్తరపు ఒడ్డున ఉన్న మంచిర్యాలకు దగ్గరలో గాంధారి ఖిల్లా ఉంది. ఈ కోటలోని గాంధారిమాతను గోండులు, నాయకపోడు గిరిజనులు కొలుస్తారు.
"వరంగల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఉంది. అది మల్లూరులో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఒక నాయక పోడు గిరిజనుడే ఈ ఆలయ సృష్టికర్త అనేది నిజం. దీనికి నిదర్శనంగా స్వామి ఎదుట వాకిట్లో ఆ భక్తుని రేఖా చిత్రంతో కూడిన ఒక శిలాశాసనం, నాయక పోడులు ఆరాధించే లక్ష్మీదేవర ఆలయం, అక్కడ నాయక పోడుల గూడెం ఆనవాళ్లు, నిజాం కాలంలో వారికి సేవ చేయడానికి వంశ పారంపర్య హక్కుగా ఇచ్చిన వెండి సనదు అనేవి ఈ స్వామి వారు మొదట నాయక పోడు గిరిజనుల దేవుడని నిరూపించే అంశాలు.
మల్లూరు లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని దాటి గోదావరి కొంత ముందుకి పోయినప్పుడు పర్ణశాల ప్రాంతం వస్తుంది. అక్కడ పాండవులు తిరుగుతున్నప్పుడు భీముడు హిళింబి అనే గిరిజన కన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఘటోత్కచుని కనడం వల్ల ఇక్కడ గిరిజనులైన నాయక పోడులు భీముని, అతని బావ శ్రీకృష్ణుని, ఆయన భార్య లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఒకప్పుడు మల్లూరు గిరిజన గ్రామంలో ఉండి ప్రస్తుతం ఖాళీగా ఉన్న గ్రామం పేరు లక్ష్మీపురం గూడెం. ఇప్పటికీ అక్కడ గిరిజనులు లక్ష్మీదేవిని పూజిస్తున్నారు.
"గోదావరి దక్షిణాభిముఖంగా ప్రవహించే ప్రదేశం కంతనపల్లి. అక్కడ ప్రకృతి మిక్కిలి రమణీయంగా ఉంటుంది. అక్కడ ముళ్ళకట్ట అనే గ్రామంలో కోయలు నాయకపోడు గిరిజనులు అధికంగా ఉన్నారు. అక్కడ నాయకపోడు గిరిజనులు లక్ష్మీదేవి సంబరం అనే ఉత్సవం సందర్భంలో నృత్యాలు చేస్తారు.
క్రీ.పూ. ఆరవ శతాబ్దంనాటి ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొనబడిన అంధ్ జాతి గిరిజనులు గోదావరి నదికి ఉత్తరాన నివసిస్తున్నారు. నిర్మల్ దగ్గర వారి ప్రాచీన పట్టణమైన అంధకూరు ఉంది.
గోదావరి నది ఏడుపాయలుగా చీలే దృశ్యం కరీంనగర్ జిల్లాలో గోదావరి ప్రవేశించే చోట కనిపిస్తుంది. ఈ సప్త గోదావరిని వాల్మీకి తన రామాయణంలో రమణీయంగా వర్ణించాడు. వాల్మీకి ఈప్రాంతంవాడే అనడానికి నిదర్శనంగా ఈ సప్త గోదావరి ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి వాల్మీకి తెగకు చెందిన ప్రజలు ఇప్పటికీ
9