ప్రధాన్ ల సంగీతం
పూర్వం ప్రధాన్ లు గోండు రాజుల ప్రశస్తి గాయకులుగా ఉండేవారు. వీరు గోండుల రాజ్యపాలన అంతరించిన తర్వాత గోండుల సంస్కృతి పరిరక్షకులుగా మిగిలారు. ప్రధాన్ ల పాటలు లేకుంటే గోండులకు సంబంధించిన ఇతిహాస పురాణ కథలు, చరిత్రలు, గోండుల వంశావళి కథలు ఉండకపోయేవి. పెర్సాపేన్ (పెద్ద దేవుడు లేదా మహాదేవుడు) పూజా సమయంలో ప్రధాన్ లు కిక్రి అనే సంగీతవాద్యాన్ని వాయిస్తూ పాటలు పాడుతూ తన్మయిలై పోతారు. ఈ క్రింది పాటల ద్వారా గోండులు, ప్రధాన్ లు ఒకే సంస్కృతి సంప్రదాయాలకు చెందిన వారని తెలుస్తుంది.
5" ఫాళపేన్ పాట ఆతాయే,
సెళోమి గోండిత కీతాయే,
ఉద్దీ నతుదోర్ కోయ్ తోరే పాళలే,
భీడి పాడి సారా ఉందియే,
పేన్ ఖాడా ఇచ్చోడే పారి సోయ్ రానా
రీతిభీతి సారా ఉందియే
గోండ్వానా అవ్ లే ఆతాయే”
'మా పెద్దదేవుని వర్ణించేవాడు ప్రధాన్ అయ్యాడు. ఆయన గోండి దేవతల మూలాన్ని వెతికాడు. కోయతూర్ మరియు ప్రధాన్ ఒకే రక్తం వారు. వారి ఇంటి దేవతల పేర్లు, వంశావళి ఒకే రకంగా ఉన్నాయి. దేవతల పూజా విధానం, సంబంధ బాంధవ్యాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. సాంస్కృతిక భావనలు ఒకే విధంగా ఉన్నాయి' అని ఈ పాటకు అర్థం.
ప్రధాన్ లు పాడే అనేక గీతాలు గోండుల దండారి ఉత్సవాలకు ఆలంబనం అవుతాయి. అందుకు ఈ క్రింది గీతం నిదర్శనం.
6"గుద్మాసుర్ పటేడత రావుడ్
మంతో తినెకమిసిల్లె
ధన్ - దౌలత్ వీర్కి వెల్లెమంత
పేన్ సీత బతయ్ కమ్మి సిల్లె......"
'గుద్మాసుర్ పటేరాలో రావుడ్ ఉంటున్నారు. వారికి తిండికి కొదవలేదు. చాలినంత సంపద వారికి ఉంది. ఇదంతా దేవుళ్ళ చలవ. వారికి లోటు ఏమీ లేదు. భగవంతుడిచ్చిందంతటికి ఇప్పుడు మేము నృత్యోత్సవాలు జరుపుతాము.
7"నేంద్ మహాగ సోనమంత
నాడి సిల్లె మందర్
గరీబ్ ఆకట్, సోనె పుట్వెక దాయర్
నందిర్ రావుడ్స్ ఇంతెర్
బహాన్ తుంగన.......”
171