నాగోబా:- పుష్యమాసంలోని అమావాస్యనాడు మెస్రమ్ వంశస్థులు కేస్లాపూర్ లోని నాగోబా దేవాలయంలో పూజలు చేస్తారు. ఈ ఉత్సవానికి గిరిజనులందరూ అన్ని ప్రాంతాల నుండి వెళతారు.
దేవల్ పునాక్:- దేవతల పున్నమిగా భావించే ఈ పండుగను ప్రధాన్ లు విశేషంగా భావిస్తారు. మాఘ పూర్ణిమ రోజున మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న బండారు జిల్లా సల్లికస తాలూకాలోని కచార్ ఘడ్ గుహ దగ్గర పాహండి కుపార్ లింగో, హీరా సుక ఉత్సవాలు జరుగుతాయి. ఘనంగా జరిగే ఈ వేడుకకు ప్రధాన్ లు తప్పక హాజరవుతారు.
దురాడి పండగ:- ఇది హెూలీ పండుగను పోలి ఉంటుంది. ఫాల్గుణ పున్నమి నాడు ప్రధాన్ గిరిజన పురుషులు కోలాటం ఆడుతూ సందడి చేస్తారు. దీన్ని వ్యవసాయ పనులకు ఆరంభ సూచకంగా భావిస్తారు.
మండా పుస్:- ఫాల్గుణ అమావాస్యనాడు నూతన సంవత్సరానికి ఆహ్వాన సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా పశువులను శుభ్రం చేసి అలంకరించి పూజిస్తారు.
అకాడి:- ఈ పండుగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. తమ ఇష్ట దైవాలను పూజించి గుస్సాడీ పండుగను ప్రారంభిస్తారు.
జామున్ అపుస్:- ఈ పండుగను ఆషాడ అమావాస్య రోజున జరుపుకుంటారు.
నాగపంచమి:- మెస్రమ్ వంశస్థులు అత్యంత నిష్టగా జరుపుకునే పండగ ఇది. దీన్ని ప్రధాన్ లు కూడా పుట్టలో పాలు పోసి పూజ చేసి పండుగ చేసుకుంటారు.
దసరా, దీపావళి పండుగలను భారతీయులందరివలెనే ప్రధాన్ లు కూడా జరుపుకుంటారు.
సట్టి పేన్:- దీపావళి తర్వాత కొత్తగా ఫలసాయంగా కూరగాయలు వచ్చినప్పుడు సట్టిపేన్ పండుగను చేసుకొని, కూరగాయలను తింటారు.
సోదర సోదరీ పండగః - అన్నదమ్ముల క్షేమాన్ని కోరి సోదరీమణులు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కొబ్బరి చిప్పలు చక్కెర తమ సోదరులకు ఇచ్చి సోదరుల నుండి బహుబతులు స్వీకరిస్తారు.
e. ఆచార వ్యవహారాలు:-
జననం:- శిశువు జన్మించిన తర్వాత ప్రధాన్ లు ఇంటిముందు లేదా వెనక భాగంలో గుంట తవ్వి దానిపై వేపకట్టెలు వేసి తునికి, వేప, జీడి ఆకులను వేస్తారు. అలాగే బాలింత స్నానం చేసే నీటిలో తంగేడు, వావిలి ఆకులు వేస్తారు. దీనివల్ల గాలివల్ల, నీటివల్ల వచ్చే క్రిములు చేరవని నమ్ముతారు. బిడ్డకు బొడ్డు ఊడిన తర్వాత బాలింతను గృహంలోనికి రానిచ్చి బిడ్డకు మేనమామ చేత పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. బిడ్డ పుట్టిన సగా దేవతకు పూజ చేసి ఇరవై ఒకటవ రోజున బిడ్డకు నామకరణం చేస్తారు. అంతవరకు తల్లి బిడ్డలను నేలపైనే పడుకోబెడతారు. నామకరణం అయిన తర్వాత వారిని మంచంపై పడుకోనిస్తారు.
167