Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంధ్ ల సంగీత వాద్యాలు

అంధ్ జాతివాళ్లు మృదంగం, తబల, డోల్కి, జతూర్, చౌన్డకా అనే వాద్యాలను ఉపయోగిస్తారు. మృదంగం అనేది మద్దెల. దీన్ని గోండులు, తోటీలు పర్ర అంటారు. తబలను మృదంగానికి పక్కవాద్యంగా సంగీతమేళంలో వాయిస్తారు. కర్ణాటక సంగీతంలో మృదంగాన్ని సహవాద్యంగా ఉపయోగిస్తారు.

11చెన్దకా:- ఇది జానపదుల జమిడిక వాద్యం వలె ఉంటుంది. వెదురు కర్రకు సొరకాయ బుర్రని బిగించి, దానికి ఒక తీగను వెదురుకట్టెతో అనుసంధానం చేస్తారు. వెదురు కట్టెకు ఒక గొట్టం లాంటి దాన్ని బిగించి, అందులో నుండి ఒక తీగను తీసి వెదురు కట్టెకు బిగిస్తారు. జమిడిక వాద్యానికి సొరకాయ బుర్ర ఉండదు. జమిడిక, చౌన్దకా వాద్యాలను వాయించే విధానంలో భేదం ఉంది


జమిడికను చంకలో పెట్టుకొని దాని లోపల తీగను చేతితో మీటుతారు. చెన్దకా వాద్యాన్ని భుజాన పెట్టుకుని గొట్టం పైన సొరకాయ బుర్రని కలిపే తీగను మీటుతారు.

అంధ్ లు శృతికి తాళాలను వాడతారు. వాటిని వారు జలర్క్ అంటారు.

ఆధార గ్రంథాలు

1. తెలుగు భాషా చరిత్ర పుటల సంఖ్యలు-1-5.
2. అంధ్ సంస్కృతి, శ్రీమతి సంగీత, శ్రీ. విష్ణు, మరియు శ్రీ.కైలాష్ (ఆంధ్).
3. విషయదాత-శ్రీమతి సంగీత, ఆంధ్ ట్రైబ్
4,5,6,7,8,9,10 - పాటలు-సంగీత(అంధ్ గిరిజన స్త్రీ)
11. కొమరం భీమ్ మ్యూజియం, జోడేఘాట్, ఆసిఫాబాద్.

162