Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5" హే మానవా! జన్మనీ వ్యర్థ జాసిల్ రే
ధర్ పట్టాపూర్ చి వాట్ ధన్య హెూసిల్ రే,
మిళె జీవనాల ఫళ, జసే జ్యాచే కర్మరే,
పూలాజిచా బోధ్ ఆహే, పాళా సత్య ధర్మరే,
పట్నాపూరి అజ్ఞాన ముక్త్ హెూసిల్ రే...."

'ఓ మానవుడా! నీ మానవ జన్మను వ్యర్థం చేసుకోకు. పట్నాపూర్ లో ఉండే పూలాజీబాబా వారి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తే నీ జన్మ ధన్యం అవుతుంది. ఎవరి కర్మ ఫలానుసారంగా వారికి ఫలితం లభిస్తుంది. సత్య ధర్మాన్ని పాటించండి. మనసు ఇంద్రియాధీనం అయితే ఈ దేహాన్ని నాశనం చేస్తుంది. చెడు వ్యసనాలు వల్ల మనిషి నీతి ధర్మాలను విడిచిపెడతాడు. దేహమందిరంలో శ్రీ పూలాజీ మూర్తిని స్థాపించండి. పరమార్థమనే జీవనాన్ని సార్థకం చేసుకొని, అజ్ఞానం నుండి ముక్తిని పొందండి' అనేది ఈ పాటలోని భావం.

6 “కర్ భరోసా, పూలాచ్యా వాణివరి,
మానవా దేవ నాందే తుజ్యా అంతరి,
దేవ దేవ మణునియా ఫీరలా అజ్వరీ,
పాహిలాకారే దేవ కుడ్యా మందిర,
గెలా అనమోల్ వేజ్ హా వెడ్యావరి,...."

'ఓ మానవుడా! పూలాజీ బాబా గారి అమృతవాణి పై నమ్మకం ఉంచు. దేవుడు మీ అంతరంగం లోనే ఉన్నాడు. దేవుడు అనుకుంటూ ఎక్కడెక్కడో తిరిగావు. ఏ మందిరంలోనైనా నిజమైన దేవుని చూశావా? అమూల్యమైన నీ సమయాన్ని ఒక పిచ్చివాడిలాగా వృధా చేసుకుంటున్నావు. దేవుడు లేని ప్రాణి ఈ భూమిపై లేదు. అన్ని ప్రాణులలో దేవుడున్నాడు. ఎల్లప్పుడూ సత్య ఆచరణ కలిగి ఉండాలి. పరోపకారం కొరకు మన జీవితం అర్పితం చేయాలి. కేవలం కాషాయ వస్త్రధారణతోను, అలంకరణలతోను దేవుని చూడలేము. నిత్యం అంతరాత్మని 'సోహం' నామంతో ధ్యానించడం వలన ఈశ్వరుని మనలోనే మనం దర్శించవచ్చు' అనేది ఈ పాటలోని భావం.

7 “ధరి అఖండ భక్తావరీ కీపెచీ సావలీ,
దివాంచీ మావులి పులాయి, తుదీనాంచీ మావులీ,
మీటువి నైన కరితా చింతన, పరమాత్మచే ఘడో దరశన,
జీవా శివాచే మిలన్ హెూతా ముక్తి పావలీ....”

'హే పులాజీ! భక్తులపై దీనజనులపై మీ చల్లని కృపా కటాక్షము అఖండంగా ఉంటుంది. కళ్ళు మూసి ఆత్మచింతన చేసే వారికి మీరు ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని కలుగజేస్తారు. జీవిని శివంలో ఐక్యం చేసి భక్తులకు ముక్తిని కలుగజేస్తారు. మీ శక్తి వలన భక్తులకు త్రివేణి సంగమం అనే గంగా యమున సరస్వతి పుణ్యస్నానం త్రికుటిలోనే కలుగుతుంది. భక్తి తన్మయత్వంలో మీ కీర్తిని గానం చేస్తున్న ఈ దాసుడిని ఓ గురుదేవా! పావనం చేయండి' అనేది ఈ పాటలోని భావం.

ఈ విధంగా పూలాజీ బాబా పాటల ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో స్వచ్ఛమైన జీవన విధానాన్ని అలవర్చుకొని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్న ధన్యజీవులుగా అంధ్ లు కనిపిస్తున్నారు.

160