Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంద్ ల సంగీతం

అంధ్ లు పూలాజీ బాబా ప్రబోధాలతో ప్రభావితులై తమ జీవన విధానాన్ని మార్చుకున్నవారు. ప్రాచీనమైన సనాతన ధర్మాలను ఆచరిస్తున్న వారు. సన్మార్గంలో నడుస్తున్నవారు. వీరు ఎక్కువగా పులాజీ బాబా భజనలు పాడుతున్నారు. బాబాను భగవంతునిగా పూజిస్తున్నారు. ఆయనకు ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో వీరు అనేకమైన పాటలు పాడతారు.

4"నిత్య నేహ్మి ధ్యాన కరు
సద్గురు చే చరణ ధరు,
మంగళ మయ నామ స్మరు,
ధ్యాన మార్గహ జగా వేగళ
అజవర నవత కళలా
బాబా పులాజీ నే జగా
సమోర ఉఘడే కేలే త్యాలా
త్రికుట స్థాని ధ్యాన కరు.....”

'ప్రతినిత్యం ధ్యానం చేస్తూ సద్గురు నామాన్ని స్మరిస్తూ ఆయన చరణాలను సేవిద్దాం. ధ్యానమార్గము అలౌకికమైనది. ఇప్పటివరకు మనకు అర్థం కాలేదు. పులాజీ బాబా దీనిని సమస్త లోకుల కొరకు బహిర్గతం చేశారు. త్రికుట స్థానంలో ధ్యానం చేయాలి. గుడ్డి జనులు నిజమైన దేవుని స్మరించరని సంత్ తుకారాం చెప్పి వెళ్లారు. సంతుల వాక్యాలను స్మరిస్తూ మంగళమయ నామాన్ని స్మరిద్దాం. గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు సద్గురు లేకుండా దేవుని దర్శించలేము. సద్గురు సాక్షాత్తు పరమేశ్వరుడు. కాబట్టి నిజమైన మార్గమును విడిచి వెళ్ళకూడదు' అని ఈ పాటలోని భావం.

159