Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

01 తెలంగాణ గిరిజనుల పరిచయం

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 (1)వ షెడ్యూల్డ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలు గుర్తించ బడినాయి. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంతాలు 13924.46 స్క్వేర్ కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మొత్తం 85 షెడ్యూల్డ్ మండలాల్లో 30 సంపూర్ణ మండలాలు, 55 పాక్షిక షెడ్యూల్డ్ మండలాలు, 1174 షెడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సాధారణ జనాభా 1919768. అందులో షెడ్యూల్డ్ తెగల జనాభా 842885 కాగా మొత్తం జనాభాలో గిరిజనులు 43.90%గా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా 31.78 లక్షలు కాగా మొత్తం జనాభాలో వీరు 9.08% గా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 32 షెడ్యూల్డ్ తెగలను గుర్తించారు. ఒకే మాండలికాన్ని మాట్లాడుతూ, ఒకే నిర్ణీత ప్రాంతంలో నివసిస్తూ, ఒకే వృత్తిని పాటిస్తూ, అంతర్వివాహ సమూహంగా ఉండేదే తెగ. అంతర్వివాహ సమూహం అంటే ఒక తెగలోని వారు ఆ తెగలోని వారితోనే వైవాహిక సంబంధాన్ని ఏర్పరుచుకోవడం.

అత్యల్ప జనాభా కలిగి వెనకబడిన సాంఘిక ఆర్థిక స్థితిగతులను కలిగి, సామాన్య ప్రజలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారిని, ఎటువంటి పరిపాలనా సంబంధిత సహాయ సహకారాలను పొందలేని స్థితిలో ఉన్న వారిని ఆదిమ జాతి గిరిజనులుగా (పివిటిజిగా) గుర్తించారు. ప్రాంతీయతను ఆధారంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు (పివిటిజి) లను గుర్తించారు. తోటి, కోలామ్, చెంచు కొండరెడ్డి అంతరించిపోయే దశలో ఉన్న ఆదిమ జాతి గిరిజనులను దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాలలో భారత ప్రభుత్వం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలను (ఐటిడిఎ) ఏర్పాటు చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కొరకు వివిధ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో పివిటిజిల అభివృద్ధికి పలు కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధతో భారత ప్రభుత్వం నాలుగు ఐటిడిఎలను ఏర్పాటు చేసింది. ఒకటి భద్రాచలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), రెండు ఏటూరు నాగారం (ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా), మూడు ఉట్నూర్ (ఆసిఫాబాద్ జిల్లా) నాలుగు మన్ననూర్ (నాగర్ కర్నూలు జిల్లా) అనేవి.

భారత ప్రభుత్వ సహాయ సహకారాలతో గిరిజనుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కొరకు కన్సర్వేషన్ కం డెవలప్మెంట్ ప్లాన్ ను (సిసిడిపి) ప్రతి పంచవర్ష ప్రణాళికలో ఐదు సంవత్సరాల అభివృద్ధి ప్రణాళికను

2