ఘటియాల్ కుల పెద్దకు సహాయకారి, హవల్దార్ వార్తావాహకుడు. వీరు అందరూ కలిసి గ్రామంలోని ఏ రకమైన సమస్య వచ్చినా గ్రామపంచాయతీ లోనే పరిష్కరిస్తారు.
d. మత విశ్వాసాలు:- తోటీలు ప్రకృతి దేవతలను ఎక్కువగా పూజిస్తారు. పంటలు వేసేటప్పుడు, పంటలు కోతకు వచ్చినప్పుడు, భూదేవిని పూజిస్తారు. వీరు పుట్ట చెట్టు రాయి వంటి వాటిని దేవతా ప్రతిమలుగా పూజిస్తారు. రెండు మూడు రాళ్లు పెట్టి ముగ్గువేసి పంచపాండవులుగా పూజిస్తారు. వీటితోపాటు వారి గోత్ర చిహ్నాలు కూడా పూజిస్తారు. శ్రావణమాసంలో జల్లిదేవరను పూజిస్తారు. శివుని రూపంగా కొత్త కుండను, తొలకరి వర్షాలు పడినప్పుడు 'అకిపేన్' దేవతను వేపచెట్టు రూపంలోనూ, 'పెర్సాపేన్' అనే దేవుని పుట్ట రూపంలోనూ పూజిస్తారు. మెస్రం వంశస్థులు నాగోబాను విశేషంగా పూజిస్తారు.
e. ఆచార వ్యవహారాలు:
జననం:- తోటి స్త్రీలు ఇంటి దగ్గరే మంత్రసానుల తో ప్రసవం చేయించుకుంటారు. ప్రసవం అయిన తర్వాత అయిదవ రోజున బాలింతను, బిడ్డను బావి దగ్గరికి తీసుకొని పోతారు. ఆ సమయంలో వారు ఇంటినుండి బావికి చేరుకునే దారిపొడవునా కొన్ని జొన్నలను, పప్పు ధాన్యాలను చల్లుకుంటూ పోతారు. బాలింతచేత బావి దగ్గర పూజ చేయించి, తర్వాత బావి నీటిని తెచ్చి ఇంటిదగ్గర స్నానం చేయిస్తారు.
వివాహం:- తోటిలలో మేనరికం పెళ్లి సంబంధాలు ఎక్కువగా జరుగుతాయి. కట్నాలు వీరికి లేవు. పెళ్లి అబ్బాయి ఇంట్లోనే జరుగుతుంది. ఎడ్లబండి మీద వధువుని తీసుకుని వరుని ఇంటికి పోతారు. అబ్బాయి అన్న వదినలు అమ్మాయి కాళ్లు కడుగుతారు. తర్వాత పెళ్లి కూతురు వాళ్లకు ఉల్లి జావ ఇస్తారు. పెళ్లికూతురుకు ఆమె సగాకు చెందిన వారి ఇంటిలో విడిది ఏర్పాటుచేస్తారు. రాత్రి పెళ్ళికొడుకు స్నానం చేసి తుడుచుకున్న వస్త్రాన్ని వధువుకు పంపిస్తారు. తర్వాత వరుని కాలికి కోడిని కడతారు. అతడు అప్పుడు నృత్యం చేస్తాడు. ఆ కోడిని పెళ్ళికూతురు వదినకు ఇస్తారు.దీనివల్ల కోడి పిల్లలవలె వారి వంశం అభివృద్ధి చెందుతుందని నమ్మకం. పెళ్ళికొడుకు నల్లపూసలు తాళిబొట్టు కలిపి దండ తయారు చేస్తాడు. మర్నాడు గుడిలో తాళిబొట్టుతోకూడిన నల్లపూసల దండను వరుడు వధువు మెడలో వేస్తాడు. అనంతరం బంధుమిత్రులతో విందు వినోదాలతో వివాహం పూర్తి అవుతుంది.
అంత్యక్రియలు:- తోటిలు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని దుప్పట్లో లేక, బొంతలో చుట్టి మంచం తిరగేసి దాని మీద పెట్టి స్మశానానికి తీసుకొని పోతారు. ఐదవ రోజు చనిపోయిన చోట బియ్యం వేసి కోడిని వదులుతారు. కోడి బియ్యం తింటే చనిపోయిన వ్యక్తి సంతృప్తి చెందినట్లుగా భావిస్తారు. దీనకర్మ రోజున ఆడవాళ్ళు ఇప్పచెట్టు దగ్గర నృత్యాలు చేస్తారు. శవాన్ని కాల్చిన చోట పురుషులు నృత్యం చేస్తారు.
146