7నాయక పోడుల నృత్యం:- నాయక పోడుల నృత్యాలు ఇతర గిరిజనుల నృత్యాల కంటే భిన్నంగా ఉంటాయి. వీరు ముఖానికి ముసుగులు ధరించి నృత్యం చేస్తారు. నాయక పోడులు చేసే పోచమ్మ నృత్యం, కుల పండుగ నృత్యం, ముసుగు నృత్యం అనే నృత్యాలలో ముసుగు నృత్యం ముఖ్యమైనది. నృత్య ప్రదర్శకులు పంచ పాండవులు, పోతురాజు, శివుడు, కృష్ణుడు, పోచమ్మ ముఖం ఆకారంలో కొయ్య ముసుగులను ధరించి నృత్యం చేస్తారు. ఈ నృత్యం డప్పు ధ్వనితో మొదలవుతుంది. ఇందులో మోటుదనంతో కూడిన ఉధృత విన్యాసాలు ఉంటాయి. కనుక ఈ నృత్యాన్ని ఎక్కువగా పురుషులే చేస్తారు. వీరు వంశపారంపర్యంగా ఈ నృత్యాన్ని నేర్చుకుంటారు. ఇది చక్కటి వినోదాన్ని కలిగిస్తుంది. ప్రేక్షకులు అరుపులు చప్పట్లతో కళాకారులను ఉత్సాహపరుస్తారు. డప్పు, పిల్లనగ్రోవి, కాలికి గజ్జలు వీరి వాద్య పరికరాలు. ముసుగు నృత్యంలో అలంకరణ ఎక్కువగా ఉంటుంది. నాయక పోడుల ఇతర నృత్యాల్లో అలంకరణ సాదాసీదాగా ఉంటుంది.
నాయకపోడుల సంగీతం
నాయకపోడులకు తమదైన ప్రత్యేక భాష ఒకప్పుడు ఉండేది. అది కోలామీ భాషకు దగ్గరగా కొంత సారూప్యతను కలిగి ఉండేది. కానీ ప్రస్తుతం వారు స్వచ్ఛమైన తెలుగును మాట్లాడుతున్నారు. వారి పాటలు కూడా తెలుగులోనే ఉన్నాయి.
17"అల్లో నేరేడు నీ అన్నలు వచ్చిరి ఏమి తెచ్చిరి,
అల్లో నేరేడు నీ మామలు వచ్చిరి ఏమి తెచ్చిరి,
అల్లో నేరేడు నీ తాతలు వచ్చిరి ఏమి తెచ్చిరి,
అల్లో నేరేడు నీ అక్కలు వచ్చిరి ఏమి తెచ్చిరి.....”
127