ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ముగ్గులు వేస్తారు. బాసికాలను పెద్దలు మందిరంలో పోచమ్మ దేవతకు చూపించి తెచ్చి వధూవరులకు కడతారు. నల్లపూసల దండను వరుడు తయారుచేసి వధువు మెడలో కడతాడు. పెద్దలు అక్షింతలు వేసి, కానుకలు సమర్పిస్తారు.
అంత్యక్రియలు:- వివాహితులు మరణిస్తే ఊరికి దూరంగా ఉన్న స్మశానవాటికలో దహనం చేస్తారు. అవివాహితులు అయితే పూడ్చి పెడతారు. పదకొండవ రోజున విభూతిదారులు అయితే జంగం వారితోనూ, నామాలు వారైతే సాతానివారితోనూ అంత్యక్రియలు జరిపిస్తారు. తర్వాత గూడెంలో భోజనాలు చేస్తారు.
126