11"మహరాజా! కోట్ట నీకు పోరి సీంతో నిమ్మెతిన్,
మాకు నాలుంగ్ మహిన చోకట్ ఇర
మమ్మట్ దండారి పీసి వెలియాంతోమ్
మాకు యేర్కి దుఃఖ్ అయిన ఉండె,
మహిన నీవ పూజ తుంగాంతోమ్
మాకు చోకట్ యిర దుంద్రేయా రావుర్ పేన్
సిపి సెడ్మలతల్ పేన్ మాకు చోక్టావ్ ఇర”
'ఓ దేవా మేము నీకు కోడిని ఇస్తున్నాము. దాన్ని నీవు ఆరగించు. నాలుగు నెలలు మమ్మల్ని మంచిగా ఉంచు. దండారితో కూడి మేము ప్రయాణిస్తాము. మా వద్దకు జ్వరాలు బాధలు రావద్దు. మమ్మల్ని మంచిగా ఉంచు' అని ఈ పాటలోని భావం.
గోండుల “నాగోబా” జాతర చాలా ప్రసిద్ధమైనది. ఈ జాతరలో స్త్రీలు రొట్టెలు చేసి, తీపి పదార్థాలతో నాగోబాకు నైవేద్యం పెడతారు. ఈ నాగుల చవితి పండుగను హిందువుల వలనే పుట్టలో పాలు గుడ్లు వేసి గోండులు నాగదేవతను ఆదిశేషుని అవతారంగా భావించి పూజిస్తారు. ఈ సందర్భంలో ఈ క్రింది పాటను పాడుతారు.
12"నాగోబా, కేస్లాపురత పేజ్ అంద్
నాగోబా మాక్ చొకట్ మందన
మారిమియడ్ చొకట్ మందన
పంట పొలం చొక్కట్ మందన”
'నాగోబా మీరు కేస్లాపూర్ దేవుడు. నాగోబా మమ్మల్ని చల్లగా చూడు. మా కొడుకులు బిడ్డలు వృద్ధి చెందాలి. పంటలు పొలాలు బాగుండాలి' అని ఈ పాటకు అర్థం.
13"శంభు మహదేవ, మాకు చొకట్ సైకిర్మన్,
నీవ మారి మియడ్ ఆందోమ్
మాకు చౌకట్ యిర పియంగ్
మారంగ్ కొందాంగ్ చొకట్ మన్ని”
'శంభు మహాదేవ! మీ సహకారాన్ని ఇవ్వండి. మేమంతా మీ కొడుకులం, కూతుళ్ళం మమ్మల్ని మంచిగా ఉంచండి. మా ఆవులను ఎద్దులను దూడలను చల్లగా చూడండి' అని పై పాటకు అర్థం.
ఇలా గోండుల పాటలలో భక్తి కంటే భయం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. తమ జీవనానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని, తమ పశువులకు ఎలాంటి హాని జరగకూడదని, పాములను, పుట్టలను, అడవిని, జలాన్ని, గ్రామదేవతను, శివపార్వతులను కూడా పూజించడం కనిపిస్తుంది.
115