Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీరట్ మాకు బర్కత్ సింట్ జై జై కార్,
సోనెకె మున్నె, వానెకె పజ్జ బల్ టోల్,
ఫత్తెకామ్ ఆయన దయమన్ని”.

'ఓ దేవుడా! నాగలికొనను, కొడవలిని, గొడ్డలిని అన్నిటిని దేవుని మూలలో ఉంచాము. మీకు వీటిని సమర్పిస్తున్నాము. మా సమర్పణలను స్వీకరించండి. మాకు మంచి అదృష్టాన్ని ఇచ్చి. వైభవాన్ని ప్రసాదించండి. ముందుండి మాకు దారి చూపండి. మా వెనకే ఉండి మా పనులన్నీ విజయవంతం కావాలని దీవించండి' అని ఈ పాటకు అర్థం. వ్యవసాయానికి సిద్ధమవుతూ వర్షాలు ప్రారంభం కావడానికి ముందు చేసే ఉత్సవాన్ని “పసుపు పువ్వుల గారడి” అంటారు. ఈ సందర్భంలో పాడే పాట ఇది.

గోండులు వ్యవసాయానికి సంబంధించి చేసే మరొక ఉత్సవం అఖాడి. ఈ అఖాడి సంబరాలకు గ్రామస్తులంతా గ్రామం సరిహద్దుల్లో గుమిగూడి, శివ అవ్వల్ ను (పశువుల దేవతను) ప్రార్థిస్తూ పాటలు పాడతారు. శివఅవ్వల్ ను దతూరి అవ్వల్ అని కూడా అంటారు.

9"సూడ! దతూరి అవ్వల్,
మొమట్ చౌకకట్ మందన,
పియాంగ్, మూరంగ్ నేటిల్ చౌకట్ మందన,
కాయికల్ కు బతయె అయివ"

"చూడండి దతూరి అమ్మ! మేమంతా బాగుండాలి. నేటి నుండి పశువులు, వాటి దూడలు, కాళ్లు చల్లగా ఉండాలి. నష్టం కలుగరాదు" అని ఈ గీతానికి అర్థం. ఇలా దేవతను పూజించి వేడుకున్న తర్వాత పశువులను అడవులలోకి మేతకు పంపుతారు. తర్వాత అడవిరాజును ఇలా ప్రార్థిస్తారు.

10" సూడ, మహారాజా! పొలం రాజుల్
డేట్ మళ్ళ రాజుల్, కత్తెవడ రాజుల్
బొండకి మెట్ట రాజుల్
మావంగ్ మూరంగ్ కొందంగ్,
సియాంగ్ కేడత దాంత......”

'ఓ ప్రభువా! అడవులరాజా! చూడండి. దేవుళ్ళరాజులు, కరివెర రాజులు, బోండ్ కి మెట్టరాజులతో ఆవులు, దూడలు, ఎద్దులు అడవికి పోతాయి. పశువుల కాపరి వాటి వెంట ఉంటాడు. ఆరు ఆరు పన్నెండు నెలలు మాపై దయచూపండి. మేము ప్రార్థిస్తున్నాము. మా కొడుకులు, కూతుళ్లు, పిల్లలు అడవికి పోతారు. వారికి మీ దీవెనలు ఇవ్వండి. మేము కట్టెలకు, ఆకులకు అడవికి పోతాము. మాకు పాము గాని తెలుగాని అడ్డు రావద్దు. మేమందరం బాగుండాలి. మా చేతులు కాళ్ళు బాగుండాలి. చల్లని నీడనివ్వండి' అని ఈ పాటకి అర్థం.

అఖాడి సంబరం జరిగిన సాయంత్రం మరొక ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆ రాత్రి ఎవరెవరి దగ్గర మద్దెల ఉంటుందో వారు దాన్ని బయట ఉంచి ఒక కోడిని బలి ఇస్తారు. మద్దెలపై కొంచెం రక్తం చిందిస్తారు. తర్వాత ఇలా పాటలు పాడుతారు.

114