గిరిజనులందరికీ ఇప్పపువ్వు అంటే ఎంతో ఇష్టం. ఇప్పపువ్వు పూసే కాలంలో గోండులు పాడుకునే ఈ పాట వల్ల ఆ పువ్వులు సారాకు ఎంతో ఉపయోగకరమైనవని అర్థమవుతుంది.
6"గాదె అచ్చోర్ మోదునావ,
డొమల్ ఇర్ పన బాయిన,
టోప్లె అచ్చోర్ కాపెనావ,
డొమల్ ఇర్ పన బాయిన,
చొట్క చిట్కా అర్కనన,
డొమల్ ఇర్ పన బాయిన"
'ఓ ఇప్ప పూల తల్లి! నా పొట్ట పెద్ద గాదె వంటిది. బుట్ట లాంటి ఇప్ప పూల గుత్తులు టపటపమని పడుతున్నాయి. నా జనులంతా వాటిని పోగు చేస్తున్నారు. వారంతా వాటిని ఎండబెడుతున్నారు. వాటిని నానబెడుతున్నారు. వారంతా వాటిని ఒత్తుతున్నారు. ఇప్పసారాను వడపోస్తున్నారు. వారంతా ఇప్పసారాను తాగుతున్నారు. ఇప్పసారాను తాగిన మగవాళ్ళు వారిలో వారే మాట్లాడుకుంటున్నారు. జుట్టు పీక్కుంటున్నారు. ఒకరితో ఒకరు తలపడుతున్నారు. గుంజ కొయ్యలను లాగుతున్నారు. గుంపులు గుంపులుగా దొర్లుతున్నారు. ఓ తల్లీ ఇప్పపూలమాతా!' అని ఈ పాటకు అర్థం.
ఈ పాట వల్ల ఇప్ప పూలసారా తయారీ విధానం, అది తగిన తర్వాత పురుషుల ప్రవర్తనా తీరు కళ్ళకు కట్టినట్లుగా స్త్రీలు వర్ణించడం కనిపిస్తుంది. అటవీ ఉత్పత్తుల్లో గిరిజనులకు ముఖ్యంగా ఉపయోగపడేవి ఇప్ప పూలు.
గోండులు పంటలు వేసేటప్పుడు పంట దేవతను ప్రార్థిస్తూ పాటలు పాడతారు. వీరు ఎక్కువగా వర్షాధార పంటలనే వేస్తారు కాబట్టి ఆ దేవతలను నమ్ముకుని పూజిస్తారు. పంటలు బాగా పండాలని వేడుకుంటారు. ఈ క్రిందిపాటను విత్తనాలు వేసేటప్పుడు పాడుతారు.
7"సూడ అవ్వల్ విజ్ఙ పేసి వాతోం,
జై జై కార్ సీం, చోకట్ పంట ఆయన,
బత్తయ్ దువ్వల్ తరస్ సిలే వెర్రెమన్వ,
కేడ, కొడి వెలిమర్ మంత, మాక్ చొకాట్ యిరన,
కైకాల్ కు చొకట్ యిరన”
'అమ్మ! చూడండి. విత్తడం ప్రారంభిస్తున్నాము. మాకు మంచి అదృష్టాన్ని ఇవ్వండి. పంటలు బాగుండాలి. పులులు పాముల నుండి భయం లేకుండా ఉండాలి. మేము అడవుల్లో లోయల్లో తిరుగు తుంటాము. మమ్మల్ని సురక్షితంగా ఉంచండి. కాళ్లు చేతులు చక్కగా ఉంచండి' అని పై పాటలోని భావం.
వ్యవసాయ పనిముట్లను దేవుని అరుగు దగ్గర పెట్టి ఇంటి యజమాని పర్సపేన్ ను (పెద్దదేవుని) ప్రార్థిస్తూ పాడే పాట ఇలా ఉంటుంది.
8"కూస, పాస్, సెట్టెడ్ మర్స్ కోష్టు,
తగ ఇర్ తోం నివ్వొద్ దోస్ మర్, తుంగమర్,
113