Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోండుల సంగీతం

ఆదివాసులు నిర్మించుకునే గ్రామాలంటే కొన్ని కుటుంబాల సమూహం ఒకచోట నివాసం ఏర్పరచుకోవడమే. అలాగే గోండులు తమ గ్రామాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు గ్రామానికి ఒక పెద్దను లేదా నాయకుని ఎన్నుకుంటారు. ఉత్సవాలు జరిపించడానికి ఒక పూజారిని ఏర్పాటు చేసుకుంటారు. గ్రామ నిర్మాణానికి ఇళ్ళు కట్టుకున్న తర్వాత ఒక టేకు చెట్టును చతురస్రాకారంలో చెక్కి తెచ్చి దాన్ని అకిపేన్ (గ్రామ దేవత)గా స్థాపన చేస్తారు. అకిపేన్ దేవత ముందు చతురస్రాకారంలో చెక్కిన మరొక కొయ్యను ముండా పేన్ గా నిలబెట్టుతారు. (ముండాపేన్ చనిపోయిన వారి గుర్తుగా పాతిన కర్ర).

ఈ సమయంలో గోండులు ఈ క్రింది గీతాన్ని ప్రార్థనగా పాడుతారు.

5"ఇక మొమ్మట నీవ పూజ తుంగాంతోమ్,
నార్ వాసి కింతోమ్,
మాక్ చోకట్ పంట పొలమ్ ఆయన,
కైకాల్ చోకట్ మందన,
బారా వర్షాని,
నీవ పూజ తుంగాంతోమ్”.

'దేవా! ఇప్పుడు నీ పూజ చేస్తాము. గ్రామాన్ని నిలబెడుతున్నాము. మాకు మంచి పంటలు ఇవ్వండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. పన్నెండు ఏళ్లకు ఒకసారి ఈ సంప్రదాయాన్ని పూజను పాటిస్తాము' అని ఈ పాటకు అర్థం.

112