స్థిరపడడం పవిత్ర ఉత్సవాలకు ఒక గుర్తింపు అంశాలు వారి పండుగలు ఉత్సవాలలో జరిగే సంప్రదాయాలు మానవులకు దివ్య శక్తులతో గల సంబంధాలు అన్నింటిని వారి పురాణాలు వివరిస్తాయి. గోండుల సంస్కృతిలో నాగోబా జాతర, దండారి పండుగ ముఖ్యమైనవి.
నాగోబా జాతర:- నాగోబా జాతర ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. మెస్రం గోత్రంలో ఏడుగురు అన్నదమ్ములు చేసే పూజలు ఈ జాతరకు ముఖ్యం. పూర్వం మెస్రం గోత్రానికి చెందిన అన్నదమ్ములు తమ గ్రామంలో వచ్చిన మహమ్మారి జ్వరం నుంచి తప్పించుకొని దారిలో తమ మేనమామ అయిన సాకాటిగోత్ర రాజు ఇంటికి వెళ్లారు. ఏనాడు సహాయం చేయని మేనమామను చంపడానికి వారు వచ్చారని తలచి వారి మేనమామ కుమార్తె పులిగా మారి ఆరుగురు అన్నదమ్ములను చంపివేసింది. కానీ అందులో ఆఖరి వాడు సర్పదేవతను ప్రార్థించి బ్రతికి పోయాడు. అతడు సర్పదేవ సలహా ప్రకారం పదహారు ఆడ, పద్దెనిమిది మగ దేవతలను కూడా కలిపి సర్పదేవతకు ఆలయం నిర్మించాడు. అప్పటినుండి తరతరాలుగా గోండులు నాగోబా జాతర జరుపుకుంటున్నారు. ఈ జాతరలో గుడి బయట కూర్చుని కిక్రీవాద్యాన్ని వాయిస్తూ పాటలు పాడుతారు.
దీపావళి: -గోండులకు దీపావళి చాలా పెద్ద పండుగ. దీన్నే 'విడి' పండుగ అని కూడా పిలుస్తారు. గోండులు రంగురంగుల వస్త్రాలు ధరించి, ఆభరణాలు వేసుకొని, గుంపులు గుంపులుగా చుట్టుపక్కల పల్లెలకు పోయి ఆటపాటలు ప్రదర్శిస్తారు, ఈ గుంపులను దండారిగుంపులు అంటారు. ఇరవై నుండి నలభై మంది వరకు దండారి గుంపులలో పురుషులు ఉంటారు. ఈ దండారి నృత్యంలో గుస్సాడి నృత్యం కూడా ఒక భాగం. దండారిగుంపులో కొందరు గుసాడి వేషం వేస్తారు. వేషం వేసుకున్నప్పటి నుండి గుసాడీలు నిష్టగా ఉంటారు. గుసాడీలమీద దేవతలు వాలుతారని నమ్మకం. గుసాడిలటోపి గొర్రె కొమ్ములతో చేయబడి, నెమలి ఈకలతో, రంగురంగుల అద్దాలతో,అలంకరించబడుతుంది. మెడ నిండా పూసలు, ఒంటి నిండా బూడిద, జింక చర్మం, కాళ్ళకు గజ్జలు అలంకరించబడతాయి. దండారీలకు ఈ సంగీత నృత్య వాద్యాలు ముఖ్యమైనవి.
e). ఆచార వ్యవహారాలు:-
జననం:-గోండు స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత కొన్ని నియమాలు పాటిస్తారు. గర్భిణీ స్త్రీ వేపిన మొక్కజొన్నలు గాని, నూనె గింజలనుగాని తినకూడదని అంటారు. అలా తింటే గుడ్లగూబ లాంటి పిల్లలు పుడతారని నమ్ముతారు. చేపలు కాల్చేచోటికి గర్భిణీ స్త్రీ పోయినట్లయితే ఆమెకు పుట్టే బిడ్డకు రేచీకటి వస్తుందని వీరు భావిస్తారు. ఆవుపేడతో తడికలు అలికితే పిండదారులు మూసుకొని పోతాయని చెప్తారు. ఇలా రక రకాల నమ్మకాలు వీరిలో ఉన్నాయి. గర్భ విచ్ఛిత్తి సూచన కనిపిస్తే ఒక కుండను ప్రవాహానికి ఎదురుగా నిలిపి నీటిని నింపితే నీటి శక్తి వల్ల గర్భం నిలుస్తుందని చెప్తారు. ఒక వ్యక్తి చనిపోతే అదే సంవత్సరం ఆ ఇంటిలో బిడ్డ పుడితే ఆ చనిపోయిన వ్యక్తి పునర్జన్మ పొందినట్లుగా భావిస్తారు. గర్భిణీ స్త్రీలు నొప్పులు ప్రారంభం అయ్యేవరకు పొలం పనులు ఇంటి పనులు యధావిధిగా చేస్తుంటారు. ప్రతి గ్రామంలోనూ అనుభవం ఉన్న ఒకరిద్దరు మంత్రసానులు ఉంటారు. మంత్రసానిని “న్యూయిస్” అంటారు. స్త్రీకి ప్రసవం అయిన తర్వాత బొడ్డు కత్తిరించగా వచ్చిన పదార్థాలను ఇంటి వెనుక గుంట తవ్వి ఒక పేరు తృణధాన్యాలను వేసి నాలుగు రాగి నాణాలు వేసి పూడ్చి పెడతారు.
శిశువు జన్మించిన ఐదవరోజు “పాంచ్ వీ” పండుగను జరుపుతారు. స్త్రీలందరూ ప్రసవించిన స్త్రీకి కుంకుమ బొట్టు పెట్టి రెండు రాగినాణేలను పళ్లెంలో వేసి శిశువును ముద్దాడుతారు. తర్వాత అన్నం బెల్లం నూనె గింజలు కలిపి వండిన పదార్థాన్ని భుజిస్తారు. మరుసటి రోజు బాలింతరాలు స్నానం చేసి వాగు దగ్గరకు బయలుదేరుతుంది. ఆమెతో మంత్రసాని వెళుతుంది. బాలింతరాలు కొంగులో జొన్నలు పోసుకొని దారిపొడవునా చల్లుతూ వాగు దగ్గరకు
106