Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచయిత్రి మాట

సాహిత్యం లలిత కళల్లో అగ్రేసరమైనది. సాహిత్యం ఆధారంగానే సంగీత నృత్య శిల్ప చిత్రలేఖనాలనే లలిత కళలన్నీ ప్రదర్శింపబడతాయి. సాహిత్యం త్రివిధ కాలాల్లోని విషయాలను వ్యక్తం చేయగలదు. భూతకాలంలోనూ, సమకాలంలోనూ జరిగిన మత సాంఘిక సాంస్కృతిక కళాత్మక రాజకీయ ఆర్థిక విషయాలను ప్రస్ఫుటం చేయగలదు. భవిష్యత్తు విషయాలను భావించడానికి కూడా సాహిత్యం సాధనం కాగలదు. కాబట్టి సాహిత్య పరిశోధన వల్ల ఎన్నో విషయాలు వెలుగులోనికి వస్తాయని చెప్పవచ్చు.

నా సాహిత్య పరిశోధన మొదట తంజావూరు పాలకుడైన విజయరాఘవనాయకుని ఆస్థాన కవయిత్రి రంగాజమ్మ రచనల గురించి కొనసాగింది. ఆమె రచనలలో మన్నారుదాసవిలాస నాటకం అనేది యక్షగానం,అప్పుడు ఆనాటి యక్షగానాలను పరిశీలించినప్పుడు కురవంజి పాత్ర, కురవంజి నృత్యం యొక్క ప్రాచుర్యం గురించి తెలిసింది. విజయరాఘవ నాయకుడు కురవంజి నృత్యాన్ని ఆవిష్కరించి దానికి రాజాస్థాన ప్రదర్శన స్థాయిని కల్పించాడు. అలాగే పూర్వ విషయాలను పరిశీలించినప్పుడు కళ్యాణకటకాన్ని రాజధానిగా పరిపాలించిన పశ్చిమ చాళుక్యరాజు సోమేశ్వరుడు ఒక భిల్లకాంత చేసిన నృత్యాన్ని చూసి ఆకర్షితుడై ఆ నృత్యాన్ని ప్రామాణీకరించి, గోండిలి నృత్యంగా పేర్కొని, దానికి శాస్త్రీయ నృత్యస్థాయిని కల్పించాడు.

ఈ విధంగా మహారాజులనే ఆకర్షించిన అద్భుతమైన గిరిజన నృత్యాలను వెలుగులోనికి తీసుకొని రావాల్సిన అవసరం కనిపించింది. శబ్దసౌందర్యంతో జనులను ఉర్రూతలూగించే వారి పాటలను, వారికే ప్రత్యేకమైన వారి సంగీత వాద్యాలను, కూడా వెలుగులోనికి తేవాల్సిన అవసరం ఉందనిపించింది.

గిరిజనుల మత విశ్వాసాలు, వారి విశిష్టమైన నైపుణ్యాలు, సంస్కారవంతమైన అతిథి మర్యాదలు, ప్రపంచానికి తెలియ చేయాలనే సంకల్పం నాకు కలిగింది. అందుకు 'కల్చరల్ లైఫ్ ఆఫ్ తెలంగాణ ట్రైబ్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మ్యూజిక్ డాన్స్ అండ్ మ్యూజికల్ ఇంన్స్ట్రుమెంట్స్' అనే అంశాన్ని ఎన్నుకొని 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్' న్యూఢిల్లీ సంస్థ వారికి అప్లికేషన్ పెట్టుకున్నాను.

ఈ అంశం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, నన్ను 'ఎస్ ఏ ఎఫ్ ఫెలోషిప్' కు ఎంపిక చేసిన ' ఐ సి హెచ్ ఆర్ ఎక్స్పర్ట్' సభ్యులకు, నాకు 'ఫెలోషిప్ 'ను 'సాంక్షన్' చేసిన 'ఐ సి హెచ్ ఆర్' అధికారులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను పరిశోధన చేయాలని భావించిన అంశానికి 'ఎస్ ఏ ఎఫ్' రావడం, నా ఈ పరిశోధనాంశాన్ని విజయవంతంగా పూర్తిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

దేశంలోని నాగరిక ప్రజలకు సుదూరంగా అరణ్యాలలో నివసిస్తూ ఉన్న గిరిజనుల పుట్టుపూర్వోత్తరాలను, వారి సంస్కృతి సంప్రదాయాలను, కళా విశేషాలను ప్రపంచానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో నేను చేసిన

VII