05 తెలంగాణ గిరిజనులు కొండరెడ్లు
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నదికి ఇరువైపులా ఉన్న కొండలు అడవులలో కొండరెడ్లు నివసిస్తున్నారు. కొండరెడ్లు అంటే కొండలలో నివసిస్తున్న రెడ్లు అని అర్థం. రెడ్డి పదం ప్రాచీన కాలం నుండి అనేక రూపాంతరాలను పొందినది. 'ప్రాచీన శాసనాల్లో రట్ట గుళ్ళు, రాట్టోడ్లు, రాట్ లు,రట్టర్లు రాష్ట్రకూట ప్రముఖులుగా రెడ్లు క్రీస్తుశకం 10 వ శతాబ్దమందలి శాసనాల్లో పేర్కొనబడినారు. అతి పురాతనమైన కావ్యాల్లో రెడ్డి అనే పదం రట్టడి, రడ్డి, రద్దు, రెడ్డి అనే రూపాల్లో కనిపిస్తున్నది. పాల్కురికి సోమనాథుడు 'రట్టళ్ళు' అని శ్రీకృష్ణదేవరాయలు 'రడ్డు' అని తెనాలి రామకృష్ణుడు 'రడ్డులు' అని తంజావూరు రఘునాథ నాయకుడు, చేమకూర వెంకట కవి తన కావ్యాల్లో 'రెడ్డి' అనే విధంగా రెడ్డి పదాన్ని ప్రయోగించారు.
రెడ్డి లేక రెడ్డిరికం అనేది ఒక అధికార పదవిగా చరిత్రకారులు గుర్తించారు. దీని సంస్కృత రూపం రాష్ట్రకూట. రాష్ట్ర అంటే రాజ్యం లేదా రాజ్యంలో కొంత భాగం అనీ, కూట అంటే సమూహం అని అర్థం. కాబట్టి కొంత భూభాగానికి అధికారిగా ఉండి రక్షించేవాడు లేదా పెత్తనం చేసేవాడు అనే అర్థంలో 'రట్టగుట్ట' అనే పదాలు ఏర్పడినాయి. రాష్ట్ర పదానికి తెలుగులో రట్ట అనీ, గుట్ట అనే పదానికి రక్షకుడు పెత్తనం చేసేవాడని అర్థాలు ఉన్నాయి. ఈ రెండు తెలుగు పదాలు కలిసి రెడ్డి పదం ఆవిర్భవించినట్లు చరిత్రకారులు నిర్ణయించారు.
రెడ్లు మొదటి నుండి వ్యవసాయం ముఖ్యవృత్తిగా కలిగిన వారు. కానీ కొందరు ధైర్య సాహసాలు కలిగిన వారు రాజ్యపాలన చేపట్టారు. కొండ ప్రాంతంలో తమ అధికారాన్ని నిలబెట్టుకున్నవారు అడవులలో నివసించినవారు కొండరెడ్లుగా ఏర్పడినారు. ప్రస్తుతం రెడ్డి అనే పదం కులంగా చలామణిలో ఉంది.
కొండరెడ్లు అంతరించిపోతున్న గిరిజనజాతులలో చేరిపోయారు. వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉన్నది. వీరి మాతృభాష తెలుగు.
కొండరెడ్లు అనేక గోత్రాలవారు ఉన్నారు. ఒక వంశానికి చెందిన వారందరూ ఒకే గోత్రానికి సంబంధించి ఉంటారు. వివాహ విషయంలో కొండరెడ్లు గోత్రాన్ని తప్పకుండా పాటిస్తారు. ఒకే గోత్రం వారి మధ్య వివాహ సంబంధం ఉండదు. ఆడపిల్ల వివాహానంతరం భర్త గోత్రానికి చెందినదవుతుంది. సాధారణంగా కొండరెడ్లలో ఏకపత్నీ విధానమే ఉంటుంది. కానీ పురుషులు బహుపత్నీ విధానంలో కూడా కనిపిస్తారు. కొండరెడ్లలో వివాహాలు సంప్రదింపుల ద్వారా కావచ్చు. ప్రేమ వివాహాలు కూడా ఉన్నాయి. సేవా వివాహాలు కూడా జరుగుతాయి. అప్పుడప్పుడు ప్రేమికులు లేచిపోవడం కూడా ఉంటుంది.
కొండరెడ్లు ప్రధానంగా పోడు వ్యవసాయం మీదనే ఆధార పడతారు. వీరు వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేస్తారు. వీరు అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్ముకుంటారు. వీరు వెదురుతో రకరకాల అందమైన వస్తువులను తయారు చేస్తారు. వీరు అడవిలో లభించే రకరకాల ఆకులను పండ్లను దుంపలను సేకరించి వాడుకుంటారు. వీరు
88