14అక్కుమ్:- దీన్ని ఇత్తడితో తయారుచేస్తారు. 'డాక్రా మెటల్ 'తో కూడా చేస్తారు. ఇది తూత కొమ్ము ఆకారంలోనే ఉంటుంది. దీని ఎడమవైపు భాగంలో ఊదడానికి అనుకూలంగా రంధ్రం చేస్తారు. క్రింది భాగంలో చూడడానికి కళాత్మకంగా ఉండడానికి గజ్జెలు అమర్చుతారు. కోయలు దేన్నీ పూజిస్తారు. దీన్ని ప్రత్యేకంగా వేల్పుల కొలుపులలో మాత్రమే ఉపయోగిస్తారు.
15డోలిల డోలు:- ఇది చర్మవాద్యం. ఇది రెండు అడుగుల వెడల్పు రెండు అడుగుల కంటే కొంచెం ఎక్కువగా పొడవు కలిగిన వాద్యం. దీన్ని కోయ పూజారులుగా గౌరవింపబడే డోలి కోయలు వాయిస్తారు. వీరు కోయల పెళ్ళిళ్ళు,కొలుపులు, జాతరలు, చావు, పుట్టుకలు, క్రతువులు, కర్మ కాండలు చేస్తారు. దీన్ని వీరు ఆయా సందర్భాల్లో వాయిస్తారు. ఈ వాద్యం వారికి చాలా ముఖ్యమైనది. అంతేగాక వారి సంస్కృతిలో దీనికి గొప్ప గౌరవ స్థానం కూడా ఉంది. డోలిల డోలును గుమ్మడి లేదా వేగిస మొద్దుతో తయారుచేస్తారు. మొద్దును ఆవు పేడలో ఊరబెట్టి శుభ్రం చేస్తారు. డొల్లగా చేయబడిన మొద్దుకు చివరల ఒక్కొక్క వైపు పన్నెండు రంధ్రాలను చేస్తారు. డోలును మేకతోలుతో అటు ఇటు మూసివేస్తారు. మూసేటప్పుడు సన్నని ఆరు వెదురు బద్దలతో కంటెలు చేసి కప్పుతారు. మధ్యలో మూడు రంధ్రాలను పెట్టి రెండు రంధ్రాలకు తాడు కడతారు. ఈ తాడును మెడలో వేసుకుంటారు. రెండు చేతులతో డోలు వాయిస్తారు. డోలుని ఒకవైపు చేతితో రెండోవైపు సన్నని సిరకర్రతో వాయిస్తారు. వాయిస్తున్నప్పుడు గాలి బయటకు పోయేందుకు మూడవ రంధ్రం పనికి వస్తుంది.
85