పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ


కామధేనువును, వత్సమును,
రంగము -- మహారణ్యపురము

[వృషభేంద్రరావు గారును, గోదేవిగారును, అశ్వపతిగారును, మేషేశ్వరుడుగారును, ప్రవేశించుచున్నారు.]

అశ్వ -- వృషభేంద్రరావుగారూ! మీరు అదే పనిగా దుఃఖపడి యేమిచెయ్యగలరు? వెయ్యేళ్ళుయేడ్చినా పోయిన కామధేనువు మళ్ళీ లేచిరాదు. మనమందరమూ దురదృష్టవంతులము గనుక కామధేనువున కకాలమరణము సంభవించినది. ఆ సాధుత్వమూ, ఆ ధైర్యము, ఆ దానశీలత యే ఆవుదగ్గిరనైనా వున్నారా? కామధేనువు పాలుతాగి యెందరు బ్రతికేవారు! మన భైరవమూర్తి నేటివరకూ ఆవుపాలతోనే బ్రతికినాడుగదా? మార్జాలపంతులు ఆవుపాలతోనే బ్రతుకలేదా? యింకా యెందరు పాలుత్రాగేవారు? యెందరు పెరుగు త్రాగేవారు? యెందరు మజ్జిగ పోసుకునేవారు? యింకాయెందరు వెన్న తినేవారు? యెందరు నెయ్యి తాగేవారు? యెందరు జున్ను తినేవారు? ఇదంతా మనకప్పుడే స్వప్నమైపోయింది. దుఃఖంమాని యిఖమనం బ్రతికియున్నవారి సంగతి చూడవలెను. పాపము! పోయినతల్లివద్ద పరుండి లేగదూడ యేప్రకారం యేడుస్తున్నదో చూడండి, మీరున్ను గోదేవి గారున్ను దాన్ని వోదార్చి ఆదరించవలెను. యిప్పుడు బంధువులయిన మీకెంత దుఃఖముగా వున్నదో స్నేహితులమయిన మాకున్ను అంతకంటె యెక్కువ దుఃఖముగానే వున్నది.