పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూషికాసుర విజయము 135

నేనుకూడా ఫలహారము చేసివచ్చినీకోసం ఆకంఛెకాడ కనిపెట్టుకుని వుంటాను.

మూష---చాలలేక నీవు పారిపోతావేమో కాని నేనుపారిపోను. అటువంటి చేష్టలు నావద్దలేవు.

శళ---నీపందికొక్కు చేష్టలు మాని వేగిరం వెళ్ళీరా. మళ్ళీవచ్చిన తరువాత కవలసినన్ని జంభాలు నరకవచ్చును.

మూష-జంభాలు నావయిందీ నీవయిందీ తరువాత క్రియలో తెలుస్తుంది. వట్టిమాటలతో యేమి ప్రయోజనము? మళ్ళీవచ్చినీచేతనే నాతో పరుగెత్త లేవనిపెస్తాను. చూడు.

శళ---అట్టేవాగపో. తాటాకుల చప్పుళ్ళకు కుందేళ్ళు జడుస్తవా?

మూష---తినబోతూ రుచులెందుకు? అదీతెలుస్తుంది. (అని తనయింటివంక నడుచుచున్నాడు.)

శళ---ఇదుగో నేను ఫలహారానికి వెళుతూ వున్నాను. నీవు వేగిరంగారా. (అని వెళ్ళుచున్నాడు.)

మూష---కొంచమునడిచి యిల్లుచేరి) ఓసీ! ఓసీ! వేగిరం యెదురుగుండా తా. ఈకలికాలంలో భార్యలు భర్తలకు యెదురుగుండావావడమూ శిశ్రూష చెయ్యడమూ అంతాపోయింది. ఈకాలంలో పురాణాలలో చెప్పేమొస్తరు ప్రతి వ్రతలే లేరు.

భార్య---(కన్నములోనుండిపయికివచ్చి) నేను మహాపతివ్రతనుకానా? యీలోకంలో నాకంటె భర్త ఆజ్ఞలో మెలిగేవారెవ్వరున్నారు? మీరు అక్కడా అక్కడా తిరిగి వఛ్ఛేటప్పటికి నేను సిద్ధంగావుండి మీకు సమస్తోపచార్తాలు చెయ్యడంలేదా?

మూష---వేను లోకంలో వాళ్ళమాట చెప్పినానుగాని నీమాటకాదు. నీవుతప్పకుండా పతివ్రతవే. మొగుడు చెప్పినట్లల్లాచేసే నీవంటి యిల్లాళ్ళు కొందరు వుండబట్టే