పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూషఠానుర విజయఘు- 133

[అప్పుడు శళకపతిరాఫు గారుప్రవేశించుచున్నారు.]


శళ---(తనలో)నేను నాపొలం చూచుకొవడానికి వచ్చినాను. యీతోటకూర మొక్కలు మహాయేపుగా పెరిగినవి రేపటిదినం తెల్లవారేటప్పటికి నాబంధువులనందరినీ తీసుకువచ్చి వారికి యీతోటకూర కాడలతో విందుచేసి ద్వాదశ పారణా వనసంతర్పణా కూడాచేస్తాను. తోటమాలి వచ్చే వేళాయింది, పొలమంతా చూచుకుని వేగిరం వెళ్ళిపోవలెను. (అని నిలుచున్నాడు.)

మూష---(సమీపమునకు వచ్చి) అయ్యా! నమస్కారము.

శళ---(తేరిపార చూచి తనలో) కాళ్ళు యీడ్చుకొంటూవచ్చి యీపందికొక్కు గాడు నాకు నమస్కారం చేస్తూవున్నాడు. వీడి నమస్కారం పుచ్చుకొకుండా గంభీరంగా వుండి వీడిముందర నాగొప్పతనం అంతాకనపర్చ వలెను. (అని గర్వముతో భిగ్గరగా) నీవుయెడవు? యీపొలంలోకి యెందుకువచ్చినావు?.

మూష---(తనలో) నేను పెట్టిన నమస్కారమయినా పుచ్చుకోకుండా యీచెవుల పోతుకు యెంతగర్వం వచ్చిందీ? సాధ్యమయితే నేను యిప్పుడు వీడిగర్వప్రాయశ్చిత్తంచేసి వీణ్ణీమరీ యింటికి పంపుతాను. (బిగ్గరగా) నెను వుదయాన్నే షికారువచ్చినాను. నాపేరు మూషకభట్టరంటారు.

శళ--- వంకరకాళ్లూనీవూ నీకు షికారు కూడానా! నీకాళ్ళుమరియెవరికి విధంగా వుపయోగించుకోరాదా?

మూష---(తనలో) వీడుముందుగా నాకాళ్ళమాటే యెత్తుకున్నాడు. లొకంలో యెవరికిన్ని లేనిలోపాలు యెన్నియెంచినా కోపంరాదుగాని వున్నలోపం