పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ

కొంక---ఈవిషయంలో నిష్పక్షపాతముగా చెప్పినారు.

రామ---మాకు మరిఒక ధర్మశాస్త్ర సందేహంవచ్చినది. శవాన్ని యీరాత్రే పాతిపేట్టవలెనో రేపటిదాకా వుంచవలెనో సేలవియ్యండి. నేను రేపటిదాకా వుంచవలెనంటువున్నాను.


కొంక---నేను యిప్పుడే ఖననం కావలెనంటూవున్నాను. మీరుయిందులో నిష్పక్షపాతంగా చెప్పవలెను. వాడు పక్షిగనుక, వాడికి పక్షపాతము సహజము.

గార్ధ---నాకు పక్షపాతం యెందుకు? న్యాయం చెపుతాను. ఎప్పుడుచేసినా చెయ్యవచ్చును. ఇంట్లోవాళ్ళకు కష్టంగా తొస్తుందంటే, ఆపని యీరాత్రే చెయ్యవచ్చును. పేద్దలతో ఆలోచించవలె నంటే రేపటిదాకా వుంచనూవచ్చును. ఎలాగుచేసినా ఆక్షేపణలేదు.

రామ---మీరు యీసంగతి శాస్త్రంచూచి చెప్పినారా? చూడకుండానే చెప్పుచూవున్నారా? కర్మతోచేరిన పనిగనుక మీరుబాగాఆలోచించి మరీచెప్పవలెను. ఎక్కడనైనా సూర్యాస్తమాన మయినతరువాత కర్మపుడుదుందండీ? ఒకవేళ కామధేనువుకు ప్రాణం కడపట్టిందేమో! తెల్లవారిందాకా కూడా చూస్తే యీలోగా ప్రాణంవచ్చేదీ లేనిదికూడా స్పష్టంగా తెలుసుంది.

గార్ధ---మీరు చెప్పింది బాగానేవున్నది. ధర్మశాస్త్రం చూడవలెను. సూర్యుడు లేకపోతే కర్మ పుట్టదు.

కొంక---మీధర్మశాస్త్రజ్ఞానం మొత్తుకున్నట్టేవున్నది. కర్మాపుడుతుంది అన్నీపుడతవి. సిష్టాచారం కంటె ధర్మశాస్త్రం మహాయెక్కువదాఏమిటి? మేము అన్నిచోట్లా రాత్రిళ్ళే చేయిస్తూవున్నాము. సూర్యుడు రాత్రిళ్ళు అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాడుగనుక అగ్నిహోత్రవుంటే రాత్రికర్మకు యేమీ అడ్డంకిలేదు. శాస్తుర్లుగారూ! మీరు యిలాగంటే తెలిసీ తెలియనిమాటలు చెప్పకండి. చచ్చినవాళ్ళు యేమిటి? యీమాట యెవళ్ళయినా వింటే నవ్వుతారు. శవం నిండినయింట్లో వుండగూడదు. వేగిరం సనాహం చేయించండి.

గార్థ---ఇప్పుడు దీక్షితులుగారు చెప్పినదీనాకు సబబుగానేతొచుచున్నది. నేను యేదీ నిశ్చయంగాచెప్పలేను. శాస్త్రం యెలాగువప్పితే ఆలాగు చెయ్యండి. అదుగోసభాపతులువ్యాఘ్రవధానులుగారు, వరాహభట్లుగారూ, బకసోమయాజులుగారూ వస్తూవున్నారు. ఆలోచించి సభాపతులునలుగురూ యేలాగుచెఫ్ఫీతే ఆలాగు చేతాము.